Extra Ordinary Man | టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin) నటిస్తున్న తాజా చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extra Ordinary Man). నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా (Naa Peru Surya Naa Illu India) ఫేమ్ వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్గా నటిస్తోండగా.. సీనియర్ హీరో రాజశేఖర్(Rajashekar) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్‌తో పాటు డేంజర్ పిల్లా, బ్రష్ వేసుకో పాటలు అభిమానులను ఇంప్రెస్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ఇక ట్రైలర్ మాత్రం ఓ రేంజ్లో ఉందని చెప్పోచ్చు. యాక్షన్ అండ్ కామెడీలా ఉందని తెలుస్తోంది. ఆ డైలాగ్స్, సీన్స్ థియేటర్స్‌లో నవ్వులను పూయిస్తాయడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమాలో నితిన్ ఓ జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించనున్నాడు. సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నితిన్‌కు అనుకోకుండా ఒక సమస్య ఎదురవుతుంది. ఇక ఆ సమస్య ఎంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ట్రైలర్ మొత్తం ఫుల్ కామెడీ ఎంటర్టైన్గా సాగింది. ఈ చిత్రాన్ని నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తుండగా.. యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.