Spy Movie | అవును నిజమే.. నిర్మాత, నేను కొట్టుకున్నాం, తిట్టుకున్నాం.. నిఖిల్ సంచలన వ్యాఖ్యలు
Nikhil Sidhartha | గురువారం విడుదలైన స్పై మూవీ ట్రైలర్‌కు తిరుగులేని రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ చూశాక అంచనాలు మరో రేంజ్‌కు వెళ్లాయి. కాస్త పాజిటీవ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టడం ఖాయంగా అనిపిస్తుంది. సినిమా రిలీజ్‌కు ఇంకా ఆరు రోజులే ఉంది.
Nikhil Sidhartha | గురువారం విడుదలైన స్పై మూవీ ట్రైలర్‌కు తిరుగులేని రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ చూశాక అంచనాలు మరో రేంజ్‌కు వెళ్లాయి. కాస్త పాజిటీవ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టడం ఖాయంగా అనిపిస్తుంది. సినిమా రిలీజ్‌కు ఇంకా ఆరు రోజులే ఉంది. హడావిడి విడుదలే అయినప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో రిలీజ్ డేట్ మీద రాజీ పడని నిర్మాత పట్టుదలకు హీరో కూడా మద్దతు ఇచ్చేశాడు. నిన్న, మొన్నటి వరకు ఈ సినిమా రిలీజ్‌పై గందరగోళమే ఉంది. అయితే ఆదిపురుష్ స్పీడ్ తగ్గడంతో హఠాత్తుగా నిర్మాత రాజశేఖర్ రెడ్డి ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశాడు. ఆ తర్వాత ఏకంగా రిలీజ్ డేట్‌ను ప్రకటించేశాడు.
ఫస్ట్ సింగిల్ గానీ, రిలీజ్ డేట్ పోస్టర్ గానీ నిఖిల్‌కు సంబంధం లేకుండానే నిర్మాత విడుదల చేశాడు. కాగా క్వాలిటీ కోసం, సినిమాను పాన్ ఇండియా లెవెల్లో ప్రమోట్ చేయడం కోసం విడుదలను వాయిదా చేయమని నిఖిల్ అడిగితే.. అలా చేస్తే చాలా నష్టం వస్తుందని నిర్మాత దానికి ఒప్పుకొలేదట. దాంతో కొన్ని చర్చల తర్వాత నిఖిల్, నిర్మాత దారిలోకి వచ్చేశాడు. ఆయన చెప్పిన డేట్‌కే కట్టుబడ్డాడు. ఇక తాజాగా దీనిపై ఈ యువ హీరో స్పందించాడు.
నిర్మాతతో గొడవపై స్పందిస్తూ.. ‘నిజమే.. మేం కొట్టుకున్నాం, తిట్టుకున్నాం. ఏం చేసినా అన్నీ సినిమా కోసమే. ఇప్పుడంతా ఓకే. నిర్మాతను నేను ఒకటే కోరాను. 250 రూపాయలు పెట్టి థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడ్ని ఎంటర్టైన్ చేయాలి. ఇది మంచి సినిమా, అందుకే టైమ్ తీసుకుందామని కోరాను. కానీ క్వాలిటీలో కాంప్రమైజ్ కాలేదు. ఏ మాత్రం క్వాలిటీ లేకపోయినా మార్నింగ్ షో తర్వాత ఆడియన్స్ ఉండరు. మేం ఆ పని చేయలేదు. ఈ విషయంలో దర్శకనిర్మాతలు నన్ను ఫుల్ సాటీస్‌ఫై చేశారు. నేను తృప్తి చెందాను కాబట్టే, ఇప్పుడు మీడియా ముందుకు స్వచ్ఛందంగా, ధైర్యంగా వచ్చానని’ చెప్పాడు.
సినిమా రిలీజ్‌కు ఇంకా ఆరు రోజులే మిగిలిఉంది. ఈ లోపు వీలైనన్నీ ప్రమోషన్లు గట్రా చేసి సినిమాపై హైప్ తీసుకురావాలి. పైగా పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి రేయింబవళ్లు తీరిక లేకుండా కష్టపడాల్సి ఉంటుంది. దానికి నిఖిల్ సైతం కట్టుబటి బ్యాక్ టు బ్యాక్ ప్రెస్మీట్లు చేస్తామని చెప్పాడు. ఇక జూన్ 27న శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగబోతుంది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ గెస్ట్‌గా రాబోతున్నట్లు ఇన్సైడ్ టాక్. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

