Karthikeya-2 Teaser Date | యువ హీరో నిఖిల్ వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. ‘అర్జున్ సురవరం’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుంచి మరో సినిమా రాలేదు. ఈ మూడేళ్ళ గ్యాప్‌ను పూర్తి చేసేందుకు నిఖిల్ వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో కార్తికేయ-2 ఒకటి. చందు ముండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కార్తికే య చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. 2014లో వచ్చిన ‘కార్తికేయ’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. రూ.6 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం రూ.20 కోట్ల వరకు కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దాదాపు 8 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కింది.
‘కార్తికేయ-2’ తెరకెక్కుతుందని అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవలే విడుదలైన మోషన్ పోస్టర్, పాత్రల పరిచయం వీడియో సినిమాపై అంచనాలను రెట్టింపు రెట్టింపు చేశాయి. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 22న విడుదల కానుంది. ఈక్రమంలో మేకర్స్ అప్డేట్లను స్టార్ చేశారు. కాగా తాజాగా చిత్రానికి సంబంధించిన టీజర్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించారు. ఈ సినిమా టీజర్‌ను జూన్ 22న విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో నిఖిల్, అనుపమ ఓ ఫన్నీ వీడియో చేస్తూ ప్రకటించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. కాల భైరవ సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
#Karthikeya2 High Alert !! 3 days to unravel the Journey of India's Epic Adventure @actor_Nikhil @anupamahere @AnupamPKher @harshachemudu @chandoomondeti @vishwaprasadtg @AbhishekOfficl @vivekkuchibotla @kaalabhairava7 #KarthikGattamaneni @MayankOfficl @srujanamani pic.twitter.com/nE2yLTOKtz
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) June 19, 2022