Akira Nandan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ‘ఓజీ’ సినిమాలో చిన్న పవన్ పాత్రను అకీరా చేస్తే బాగుండేదనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో మెగా డాటర్ నిహారిక కొణిదెల తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అకీరా గురించి మాట్లాడుతూ నిహారిక ప్రేమగా “మై స్మాల్ బిగ్ బేబీ” అంటూ అభివర్ణించారు. “అకీరా హార్ట్ ఆఫ్ గోల్డ్. బాబాయ్ పవన్ కళ్యాణ్లాగే ఎక్కువ మాట్లాడడు. కానీ ప్రేమ మాత్రం చాలా ఎక్కువ. హీరో అవుతాడా లేదా అనే విషయం నాతో డైరెక్ట్‌గా చెప్పలేదు. మీడియా ఎక్స్పోజర్ వల్లే ఈ విషయంపై ఎక్కువ ప్రచారం జరుగుతోంది” అని తెలిపారు.
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్ల వద్ద అకీరాను “ఒమేగా స్టార్”గా పేర్కొంటూ ప్లకార్డులు కనిపించడం పై కూడా నిహారిక స్పందించారు. సెలబ్రిటీ పిల్లల ప్రైవసీకి భంగం కలిగించే విధంగా వ్యవహరించడం సరైంది కాదని ఆమె స్పష్టం చేశారు. మా టైంలో సోషల్ మీడియా అంతగా లేదు. అందుకే మా బాల్యం బాల్యంగానే గడిచింది. ఇప్పుడు పిల్లల ప్రైవసీని గౌరవించాలి. అది అభిమానంగా కాదు, అబ్యూస్గా మారుతోంది అంటూ గట్టిగా హెచ్చరించారు. ఇక తన వ్యక్తిగత జీవితంపై కూడా నిహారిక ఓపెన్‌గా మాట్లాడారు. తన వివాహ బంధం విరగడానికి ఒక్క కారణం ఉండదని, అనేక అంశాలు కలిసి ప్రభావం చూపుతాయని చెప్పారు.
రిలేషన్షిప్ నుంచి బయటకు రావాలని నిర్ణయించినప్పుడు ముందుగా నాన్న నాగబాబుగారితో మాట్లాడాను. నేను సంతోషంగా లేనని ఆయన అర్థం చేసుకున్నారు. జీవితంలో హ్యాపీగా లేకపోతే బలవంతంగా కొనసాగించాల్సిన అవసరం లేదని ఆయనే చెప్పారు అని వివరించారు.కాగా, 2020లో చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్న నిహారిక, 2023లో పరస్పర అంగీకారంతో విడిపోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రెండో పెళ్లిపై స్పందిస్తూ, నేను ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనలో లేను. కానీ పెళ్లి మాత్రం చేసుకుంటాను. విధి రాతను నమ్ముతాను. సరైన వ్యక్తి నా జీవితంలోకి రావాల్సి ఉంటే తప్పకుండా వస్తాడు అని చెప్పారు.సినిమాల విషయానికి వస్తే, నటనకు బ్రేక్ ఇచ్చిన నిహారిక ప్రస్తుతం నిర్మాతగా సత్తా చాటుతున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై వరుస ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. తాజాగా సంగీత్ శోభన్ హీరోగా ‘రాకాస’ అనే సినిమాను నిర్మించగా, ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.