Nidhi Aggarwal | గ్లామర్ టైటిల్ కోసం రాలేదు!
చిన్నప్పటి నుంచీ నటి కావాలనేది నిధి అగర్వాల్ కల. పట్టుదలతో ఆ స్వప్నం నెరవేర్చుకుంది. ఎన్నో ఇష్టాలను వదులుకుంది. చాలా కష్టాలను ఓర్చుకుంది. ఇప్పుడు వరుస అవకాశాలతో బిజీగా మారిపోయింది. హైదరాబాద్‌లో పుట్టిన ఈ సౌందర్యం బెంగళూరులో పెరిగి వన్నెలు అద్దుకుంది.
- కార్వాన్ కబుర్లు
చిన్నప్పటి నుంచీ నటి కావాలనేది నిధి అగర్వాల్ కల. పట్టుదలతో ఆ స్వప్నం నెరవేర్చుకుంది. ఎన్నో ఇష్టాలను వదులుకుంది. చాలా కష్టాలను ఓర్చుకుంది. ఇప్పుడు వరుస అవకాశాలతో బిజీగా మారిపోయింది. హైదరాబాద్‌లో పుట్టిన ఈ సౌందర్యం బెంగళూరులో పెరిగి వన్నెలు అద్దుకుంది. హైదరాబాదీ దమ్ కా బిర్యానీలాంటి నాటు రోల్స్ మాత్రమే కాదు, కన్నడ కస్తూరి తరహా నీటు పాత్రలూ సమర్థంగా పోషించగలనని నిరూపించుకుంది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఆమె నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మన దమ్ కా కస్తూరి కథాకమామిషూ చూసేద్దాం..
సినిమాల్లో నటించాలని ఉంటే సరిపోతుందా! అవకాశాలు రావాలంటే ఎవరిని కలవాలో కూడా తెలిసేది కాదు. ముంబై వెళ్లి రెగ్యులర్‌గా ఆడిషన్స్ ఇచ్చేదాన్ని. చాలామంది రిజెక్ట్ చేసేవాళ్లు. అయినా ఏ రోజూ నిరాశ పడేదాన్ని కాదు. మర్నాడు రెట్టింపు ఉత్సాహంతో ప్రయత్నించేదాన్ని.
నేను మంచి ఫుడీని. పూర్తి శాకాహారిని. ఇడ్లీ నా ఫేవరేట్. రోటీ, పెరుగన్నం చాలా ఇష్టంగా తింటా. ‘మిస్టర్ మజ్ను’ సినిమా టైమ్‌లో కాస్త లావయ్యాను. సులభంగానే తగ్గాననుకోండి. రెగ్యులర్‌గా వర్కవుట్లు చేస్తుంటాను. అలాగని భారీ కసరత్తులు చేయను. తేలికపాటి బరువులు ఎత్తుతాను. నడక, జాగింగ్ అంతే! ఆహారం విషయంలోనూ కఠిన నియమాలు పాటించను. కడుపు కాల్చుకోవడం నాకు నచ్చదు.
మా అమ్మ పక్కా హైదరాబాదీ. నేను పుట్టింది ఇక్కడే. అమ్మమ్మ వాళ్లు బషీర్‌బాగ్‌లో ఉండేవాళ్లు. చిన్నప్పుడు ఏ సెలవులు వచ్చినా హైదరాబాద్ వచ్చేసేదాన్ని. కజిన్స్‌తో సరదాగా గడిపేదాన్ని. మా బంధువుల్లో చాలామంది ఇక్కడే ఉన్నారు. షూటింగ్స్ కోసం రెగ్యులర్‌గా ఈ నగరానికి వస్తుంటాను. ఒకరకంగా చెప్పాలంటే ఇది నాకు రెండో సొంతూరు. ఇక్కడికి వస్తే మనసు నిండా చిన్ననాటి స్మృతులు మెదులుతూనే ఉంటాయి.
చిన్నప్పటి నుంచి నటి కావాలన్నది నా లక్ష్యం. మా ఇంట్లోవాళ్లకూ సినిమాలతో ఏ సంబంధమూ లేదు. అయినా ఎందుకో తెలియదు, యాక్టర్ కావాలని బలంగా ఉండేది. స్కూల్ డేస్‌లో బెల్లీ డ్యాన్స్, కథక్ నేర్చుకున్నా. ఆటల్లో చాలా చురుగ్గా పాల్గొనేదాన్ని. హార్స్ రైడింగ్ చేసేదాన్ని.
తెలియకుండానే ఒక నటికి కావలసిన అన్ని క్వాలిటీస్ పెంపొందించుకున్నా.
ఇస్మార్ట్ చేశాక గ్లామర్ హీరోయిన్గా గుర్తింపు వచ్చింది. ఆ తరహా పాత్ర చేయడం నా కెరీర్‌కు ప్లస్ అయిందనే చెప్పాలి. అయితే నా ఇన్నాళ్ల కష్టం గ్లామర్ టైటిల్ కోసం కాదు. నిధికి ఏ పాత్ర అయినా నప్పుతుంది అనిపించుకోవాలన్నదే నా తాపత్రయం. సినిమా రంగంలో ఉన్నాం కాబట్టి గ్లామర్‌కు కూడా ప్రాధాన్యం ఉంది. ఏదో ప్రయత్నించినంత మాత్రాన అందంగా కనిపిస్తాం అనుకుంటే పొరపాటు. మనలో సహజ సౌందర్యం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది.
బాలీవుడ్ సినిమాతోనే నా కెరీర్ మొదలైంది. టైగర్ ష్రాఫ్ నా ఫస్ట్ హీరో. ఆయనతో డ్యాన్స్ చేయడం అంటే పెద్ద సాహసమే! మెరుపులా తిరిగిపోతుంటాడు. చాలా కష్టపడాల్సి వచ్చేది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో పిరియాడిక్ మూవీ ‘హరిహర వీరమల్లు’ చేస్తున్నా. ఆయనతో కలిసి నటించడం గొప్ప వరం. కమల్‌హాసన్ నటనకు వీరాభిమానిని. రెహమాన్ సంగీతం, మణిరత్నం దర్శకత్వం చాలా ఇష్టం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

