Venkatesh | మళ్లీ ఎఫ్3 సినిమాతో థియేటర్లోకి వస్తున్నా: వెంకటేశ్
అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్న ఎఫ్ 3 (F3) ప్రాజెక్టు మే 27న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌కు అద్బుతమైన స్పందన వస్తోంది.
టాలీవుడ్ యాక్టర్లు వెంకటేశ్ (Venkatesh), వరుణ్ తేజ్ (Varun Tej) కాంబోలో వస్తున్న మల్టీ స్టారర్ ఎఫ్ 3 (F3). అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టు మే 27న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌కు అద్బుతమైన స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో మంగళవారం సాయంత్రం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. తమన్నా, మెహరీన్ కౌర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
‘ట్రైలర్‌కు అద్బుతమైన స్పందన వస్తోంది. ఎఫ్ 2 కంటే ఎక్కువ వినోదం ఈ సినిమా అందిస్తుంది. కోవిడ్ తర్వాత నా రెండు సినిమాలు ఓటీటీలో రిలీజయ్యాయి. ఎఫ్3 సినిమాతో మళ్లీ థియేటర్లలో మిమ్మల్ని కలుస్తుండటం ఆనందంగా ఉంది. దిల్ రాజు, శిరీష్, అనిల్ రావిపూడి వండర్ ఫుల్ స్క్రిప్ట్‌తో వచ్చారు. మొత్తం కుటుంబసభ్యులతో కలిసి ఎంజాయ్ చేసేలా సాగుతుంది ఎఫ్ 3. మే 27న థియేటర్లలోకి వస్తుంది. మీరంతా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నానని’ అన్నాడు వెంకటేశ్.
ఎఫ్ 3 చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో సోనాల్ చౌహాన్, అన్నపూర్ణమ్మ, వెన్నెల కిశోర్, ప్రకాశ్ రాజ్, రాజేంద్రప్రసాద్, సునీల్ ఇతర నటీనటులు కీ రోల్స్ చేస్తున్నారు. ఎఫ్ 2 తర్వాత దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

