Rashmika Mandanna | రష్మిక మందన్నా ప్రమోషన్‌పై నెటిజన్ల ట్రోల్స్.. ఎందుకంటే ?
Rashmika Mandanna | స్టార్ యాక్టర్లు చేసే యాడ్స్ పై కొన్ని సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి. వాటిపై ట్రోల్స్ కూడా చేస్తుంటారు. ఇంతకీ ట్రోల్స్ ఎవరిపై వస్తున్నాయనే కదా మీ డౌటు. కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna).
Rashmika Mandanna | సెలబ్రిటీలు యాడ్స్‌లో కనిపించడం సాధారణంగా జరిగేదే. అయితే స్టార్ యాక్టర్లు చేసే యాడ్స్ పై కొన్ని సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి. వాటిపై ట్రోల్స్ కూడా చేస్తుంటారు. అలాంటి న్యూస్ ఒకటి ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ట్రోల్స్ ఎవరిపై వస్తున్నాయనే కదా మీ డౌటు. కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఈ నేషనల్ క్రష్ ఇటీవలే పాపులర్ బర్గర్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న యాడ్‌లో నటించింది.
యాడ్‌లో భాగంగా రెస్టారెంట్లో తయారయ్యే ప్రఖ్యాత మెనూ ఐటమ్స్ తింటూ ఎంజాయ్ చేసింది. అయితే ఈ ఫుడ్ ఐటమ్స్‌లో ఫ్రైడ్ చికెన్ (fried chicken) కూడా ఉండటమే ట్రోల్స్ కు కారణమైంది. ఇంతకీ ఫ్రైడ్ చికెన్ ఏంటీ..? ట్రోల్స్ ఏంటి అనుకుంటున్నారా..? రష్మిక గతంలో తాను శాఖాహారీని అంటూ పబ్లిక్‌గా చెప్పిన విషయం తెలిసిందే. అయితే అప్పుడలా చెప్పి.. ఇప్పుడు మాత్రం ఇలా ఫ్రైడ్ చికెన్‌ను ప్రమోట్ చేయడం కొందరు నెటిజన్లకు నచ్చలేదు. రష్మిక అబద్దాలాడిందని, మాట మార్చిందంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ సెక్షన్లో ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.
అయితే ప్రతీ ఒక్కరికీ తినే హక్కు ఉంటుందని, ఆమె (రష్మిక) ఆహారపు అలవాట్ల గురించి ఎవరికీ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని మరికొందరు రష్మిక మద్దతుగా నిలుస్తూ కామెంట్స్ పెట్టారు. రష్మిక మందన్నా ప్రస్తుతం సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పుష్ప.. ది రూల్‌లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రణ్ బీర్ కపూర్ హీరోగా నటిస్తోన్న యానిమల్తోపాటు నితిన్-వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న vnr trioలో కూడా నటిస్తోంది.

Rashmika
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

