Viswant | పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్ హీరో..క్యూట్ కపుల్‌కి విషెస్ చెబుతున్న నెటిజన్స్
Viswant | ఇటీవల టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 'కేరింత' ఫేమ్ యంగ్ హీరో విశ్వంత్ తన జీవితంలోని కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టాడు.
Viswant | ఇటీవల టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘కేరింత’ ఫేమ్ యంగ్ హీరో విశ్వంత్ తన జీవితంలోని కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టాడు. బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెబుతూ, ఆయన భావన అనే యువతితో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ క్యూట్ కపుల్‌కి నెటిజన్స్‌తో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అయితే 2024 అక్టోబర్‌లో ఈ జంట నిశ్చితార్థం జరుపుకున్నట్టు తెలుస్తుంది. అప్పట్లో భావనతో దిగిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘A Promise of a Lifetime’’ అనే క్యాప్షన్‌తో ఆనందాన్ని పంచుకున్నాడు. అయితే అప్పట్లో అతను నిశ్చితార్థం ఫొటోలు పంచుకున్నాడా, లేకుంటే పెళ్లి ఫొటోలు షేర్ చేశాడా అనేది ఎవరికి అర్ధం కాలేదు. అయితే తాజాగా మాత్రం ఎలాంటి ప్రకటన లేకుండా సింపుల్‌గా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు ఈ జంట. ప్రస్తుతం వారి వెడ్డింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని సామర్లకోట కు చెందిన విశ్వంత్, కోయంబత్తూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన సమయంలో, దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కిన ‘కేరింత’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.
అప్పుడే సినిమా పట్ల ఆసక్తితో ఇంజినీరింగ్ మధ్యలోనే వదిలేసి ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ‘కేరింత’ సినిమా మంచి హిట్ కావడంతో విశ్వంత్‌కి పాజిటివ్ రెస్పాన్స్, వరుసగా అవకాశాలు వచ్చాయి. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి తన స్థాయిని నిరూపించుకున్నాడు.జెర్సీ, ఓ పిట్ట కథ, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, కథ వెనక కథ, తోలుబొమ్మలాట, ఆ అమ్మాయి గురించి మీకు చెబుతా, మ్యాచ్ ఫిక్సింగ్, హైడ్ అండ్ సీక్ వంటి చిత్రాలలో నటించాడు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లో కూడా ముఖ్య పాత్ర పోషించాడు. అయితే విశ్వంత్ నూతన జీవితం సంతోషంగా సాగాలని, సినిమాల్లో మరింత విజయం సాధించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

