కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. శ్రీధర్ గాదె దర్శకుడు. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కోడి దివ్యదీప్తి నిర్మిస్తున్నది. ఈ చిత్రం టీజర్‌ను దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ సొంతూరు పాలకొల్లులో ప్రత్యేకంగా ప్రదర్శించారు. వినోద ప్రధానంగా టీజర్ ఆకట్టుకుంది. ‘ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అలరిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది. సంజన ఆనంద్, సోను ఠాకూర్, సిద్ధార్థ్ మీనన్, ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజ్ నల్లి, సంగీతం: మణిశర్మ, సాహిత్యం: భాస్కరభట్ల, దర్శకత్వం: శ్రీధర్ గాదె.