కొత్త జోడీ కుదిరింది
‘డీజే టిల్లు’ చిత్రంతో మంచి విజయాన్ని దక్కించుకున్నది బెంగళూరు భామ నేహా శెట్టి. ఈ చిత్రంలో రాధిక పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తీసుకొచ్చిన గుర్తింపుతో ఆమెకు తెలుగు చిత్ర పరిశ్రమలో మరిన్ని అవకాశాలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ‘రూల్స్ రంజన్’ అనే చిత్రంలో ఆమె నాయికగా ఎంపికైంది. ఈ విషయాన్ని బుధవారం చిత్రబృందం ప్రకటించారు. ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు దర్శకుడు రత్నం కృష్ణ. ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, వి మురళీకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఈ సినిమాలో అన్నూ కపూర్, సిద్ధార్థ్ సేన్ వంటి బాలీవుడ్ తారలతో పాటు ఆశిష్ విద్యార్థి, అజయ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సాహిత్యం : కాసర్ల శ్యామ్, ఎడిటింగ్ : వరప్రసాద్, సినిమాటోగ్రఫీ : దులీప్ కుమార్, సంగీతం : ఆమ్రేష్ గణేష్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

