Neha Shetty | మోడల్‌గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్గా పలు క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తూ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది కన్నడ బ్యూటీ నేహాశెట్టి. ‘మెహబూబా’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ సోయగం ‘గల్లీ రౌడీ’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వంటి సినిమాలతో తెలుగు వారికి దగ్గరైంది. ఇక ఇటీవలే రిలీజైన డీజే టిల్లుతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె కార్తికేయకు జోడీగా ‘బెదురలంక2012’ సినిమాలో నటిస్తుంది. సోమవారం ఈమె బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో నేహాశెట్టి చిత్రగా కనిపించనుంది. లేటెస్ట్గా రిలీజైన పోస్టర్లో నేహా పల్లెటూరి అమ్మాయిలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. బెదురులంక అనే ఊరిలో 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్లు ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అనే నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇటీవలే రిలీజైన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై రవింద్ర బెనర్జీ నిర్మిస్తున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను రిలీజ్ చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.
Wishing beautiful & talented @iamnehashetty a very happy birthday ✨
Introducing "Chitra" from the world of #Bedurulanka2012 🌊 #Clax #ManiSharma @Benny_Muppaneni @Loukyaoffl @SonyMusicSouth #HBDNehaSshetty pic.twitter.com/SWaoElGgFS
— Kartikeya (@ActorKartikeya) December 5, 2022