Neethu Kapoor | చిన్ననాటి ఫోటోను షేర్ చేసిన రణ్‌బీర్ కపూర్ తల్లి.. ఫోటో వైరల్
Neethu Kapoor | బాలీవుడ్ సీనియర్ నటి నీతూ కపూర్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటూ పలు విషయాలను తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది.
బాలీవుడ్ సీనియర్ నటి నీతూ కపూర్ (Neethu kapoor) సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. సామజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటూ తన ఫ్యామిలీ ఫోటోలను తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా నీతూ కపూర్ తన ఫ్యామిలీ (Kapoor’s Family) ఆల్బమ్‌లోని చిన్ననాటి ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోలో కపూర్ అక్కాచెల్లెళ్లు కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan), కరిష్మా కపూర్ (Karisma Kapoor)లు కలిసి ఉండగా.. వారితో పాటు కపూర్ కజిన్స్ నితాషా నందా, నిఖిల్ నందా కూడా ఉన్నారు. మధ్యలో ఒక చిన్న పాప ఉండగా.. ఆమె రణబీర్ కపూర్ (Ranbir kapoor) సోదరి రిద్ధిమా కపూర్ సాహ్ని. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది.

Neetu Kapoor
ఈ ఫోటోను నీతూ కపూర్ ఇన్‌స్టా ద్వారా స్టోరీ షేర్ చేస్తూ.. “ది క్యూటీస్ (The Cuties)” అని క్యాప్షన్ ఇచ్చింది. అలాగే కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, నితాషా నందా, నిఖిల్ నందాలను ఈ పోస్టుకు ట్యాగ్ చేసింది.
సూరజ్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన నీతూ కపూర్ ఆ తర్వాత దీవార్, ఖేల్ ఖేల్ మే, కభీ కభీ, అమర్ అక్బర్ ఆంథోనీ, ధరమ్ వీర్ చిత్రాల్లో నటించింది. కాలా పత్తర్ చిత్రానికి గానూ నీతూ కపూర్ ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది. 1980లో ఆమె నటుడు రిషి కపూర్‌ను పెళ్ళి చేసుకోగా.. రణబీర్ కపూర్, రిద్దిమా కపూర్ జన్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

