NBK 107: అట్టహాసంగా మొదలైన బాలకృష్ణ 107వ చిత్రం..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల అఖండ సినిమా చిత్రీకరణ పూర్తి చేసాడు బాలయ్య. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. సింహా, లెజెండ్ తర్వాత మూడోసారి బాలకృష్ణ- బోయపాటి శీను కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో బాలయ్య అఘోరగా, ఊరుపెద్ద మనిషిగా రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాని డిసెంబర్ 2న విడుదల చేయాలని భావిస్తున్నారట.
ఇక బాలకృష్ణ 107వ సినిమా కొద్ది సేపటి క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమంలో బుచ్చిబాబు, బోయపాటి, వివి వినాయక్, కొరటాల శివ, హరీష్ శంకర్, బాబీ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే నెలలో షూటింగ్ మొదలు కానున్నట్టు తెలుస్తుంది. వాస్తవ ఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ కథను రాశారు.
ఈ సినిమాలోనూ బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారట. అఖండ సినిమాలో డబుల్ రోల్లో మెప్పించనున్న మరోసారి అలాగే అలరించబోతున్నాడట. ఆసక్తికరమైన విషయమేమంటే, ఓ పాత్రలో ఫ్యాక్షనిస్ట్‌గా మరో పాత్రలో స్వామిజీగా అలరించబోతున్నాడని సమాచారం. చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

