చంద్రముఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నయనతార (Nayanthara). ఈ బ్యూటీ తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం హిందీలో ఆట్లీ-షారుక్ సినిమా కూడా చేస్తోంది. స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా నిలిచి..లేడీ సూపర్ స్టార్ గా పిలిపించుకుంటోంది నయన్. ఈ భామ రెమ్యునరేషన్ (Remuneration) అంశం ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలుస్తుంటుంది.
ఈ సారి కూడా ఇదే టాపిక్‌పై జోరుగా చర్చ నడుస్తోంది. అయితే నయన్ పెళ్లి తర్వాత కూడా కొత్త సినిమాలకు భారీ మొత్తంలో ఛార్జ్ చేస్తుండటం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తాజా అప్డేట్ ప్రకారం నయన్ తన కొత్త చిత్రానికి రూ.10కోట్లు (Rs.10 crores) తీసుకుంటోందట. ఇంత మొత్తం అంటే చిన్న విషయమేమి కాదు..బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ ఈ రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకుంటోంది.
భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నయన్‌కు వెడ్డింగ్ తర్వాత ఫాలోవర్ల సంఖ్య మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న గాడ్ ఫాదర్ చిత్రంలో కీ రోల్ చేస్తోంది నయనతార. ఈ పాత్ర కోసం ఏకంగా రూ.4 కోట్లు తీసుకుంటున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.