Nayanthara | మంచి రోజులు ఇప్పుడే మొదలయ్యాయి.. నయనతార పోస్ట్ వైరల్
Nayanthara | ‘జవాన్’ చిత్రంతో (Jawan Movie) బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది అగ్ర కథానాయిక, లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara). ప్రస్తుతం జవాన్ సక్సెస్‌ను నయన్ ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఓ క్రిప్టీ మెసేజ్ (cryptic message)ను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్టు చేసింది.
Nayanthara | ‘జవాన్’ చిత్రంతో (Jawan Movie) బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది అగ్ర కథానాయిక, లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara). ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో నయనతార అభినయానికి చక్కటి ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రస్తుతం జవాన్ సక్సెస్‌ను నయన్ ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఓ క్రిప్టీ మెసేజ్ (cryptic message)ను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్టు చేసింది. భర్త విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) వేసుకున్న టీ షర్ట్‌పై ‘మంచి రోజులు ఇప్పుడే మొదలయ్యాయి..’ (Good times start now) అని రాసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
‘జవాన్’ చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన (గురువారం) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ (Red Chillies Entertainments) సమర్పణలో గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించింది. అట్లీ (Atlee) దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించాడు. షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)కు జోడీగా నయనతార నటించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దూసుకెళ్తోంది. కలెక్షన్ల పరంగా కాసుల వర్షం కురిపిస్తోంది. షారుఖ్ గత రికార్డులను కూడా ఈ చిత్రం ఇప్పటికే బ్రేక్ చేసేసింది.
Also Read..
Jawan Movie | వామ్మో జవాన్ ఓటీటీ హక్కులు అన్ని వందల కోట్లా.. నిజమా పుకారా?
Trisha | త్రిష లైనప్‌లో అన్ని స్టార్ హీరోల సినిమాలే.. నాలుగు పదుల వయసులోనూ జోరు చూపిస్తుందిగా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

