Trisha | త్రిష లైనప్‌లో అన్ని స్టార్ హీరోల సినిమాలే.. నాలుగు పదుల వయసులోనూ జోరు చూపిస్తుందిగా..!
Trisha | రెండు దశాబ్ధాలుకు పైగా దక్షిణాదిన స్టార్ హీరోయిన్గా చెలామణి అవుతున్న నటి త్రిష. కెరీర్ మొదట్లో పలు డబ్బింగ్ సినిమాలో పలకరిచిన ఈ అమ్మడు 2003లో తెలుగులో నీ మనసు నాకు తెలుసు అనే స్ట్రయిట్ సినిమా చేసింది.
Trisha | రెండు దశాబ్ధాలుకు పైగా దక్షిణాదిన స్టార్ హీరోయిన్గా చెలామణి అవుతున్న నటి త్రిష. కెరీర్ మొదట్లో పలు డబ్బింగ్ సినిమాలతో పలకరిచిన ఈ అమ్మడు 2003లో తెలుగులో ‘నీ మనసు నాకు తెలుసు’ అనే స్ట్రయిట్ సినిమా చేసింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. హిట్లు మీద హిట్లు కొడుతు స్టార్ హీరోయిన్ రేంజ్‌కు దూసుకుపోయింది. నాలుగు పదుల వయసు దాటినా వన్నె తరగని అందంతో యూత్‌ను కట్టిపడేస్తుంది. మాములుగా హీరోయిన్ల కెరీర్ కొంత కాలమే ఉంటుందని అంటుంటారు. కానీ త్రిష మాత్రం దానికి భిన్నంగా వయసు పెరిగేకొద్ది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. అవి కూడా ఆశా మాశీ ప్రాజెక్ట్‌లు కావు.
ప్రస్తుతం ఈ అమ్మడి లైనప్ చూస్తుంటే.. ఇప్పుడున్న యంగ్ స్టార్ హీరోయిన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం త్రిష లైనప్‌లో అరడజనుకు పైగానే సినిమాలున్నాయి. అందులో నాలుగు స్టార్ హీరోల సినిమాలే. అందులో దసరాకు రిలీజయ్యే ‘లియో’ ఒకటి. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా త్రిష నటిస్తుంది. ఇక అజిత్ హీరోగా నటిస్తున్న’ విదా మువర్చి’లో త్రిషనే హీరోయిన్గా నటిస్తుందని తాజాగా ఈ అమ్మడే చెప్పింది. వీటితో పాటుగా కమల్-మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలోనూ త్రిషనే హీరోయిన్గా ఎంపిక చేశారు. ఇక ‘దృశ్యం’ సిరీస్ దర్శకుడు జీతూ జోసెఫ్, మోహన్‌లాల్‌తో తీయబోయే రామ్ సినిమాలోనే త్రిషనే నటిస్తుంది.
ఇలా మొత్తంగా ఓ స్టార్ లైనప్‌ను సెట్ చేసుకుంది. ఓ వైపు సీనియర్ హీరోలతో జోడీ కడుతూనే మరో వైపు విజయ్ వంటి స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేస్తుంది. తెలుగులోనూ ఈ అమ్మడు చిరంజీవి నెక్స్ట్ సినిమాలో హీరోయిన్గా చేసే చాన్స్ ఉందని టాక్. ఇలా మూడు పదుల వయసులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ యంగ్ హీరోయిన్లకు సవాళ్ విసురుతుంది. ఇక ఈ మధ్యే ఈ బ్యూటీ పదేళ్ల తర్వాత సెల్వా రాఘవన్ ట్వీట్‌కు రిప్లయి ఇచ్చి వార్తల్లో నిలిచింది. పదేళ్ల కిందట ఆడవారి మాటలకు అర్దాలే వేరులో సినిమా చూసిన సెల్వా రాఘవన్.. ఈ సినిమా తనకు గొప్ప జ్ఞాపకాలను మిగిల్చిందని.. అవకాశమొస్తే వెంకటేష్, త్రిషతో సీక్వెల్ చేయాలనుకుంటున్నానని 2013లో ఓ ట్వీట్ చేశారు. దానికి త్రిష ఇప్పుడు నేను రెడీ అంటూ బదులిచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Alai-Balai | రాయపోల్‌లో అలయ్..బలయ్‌ని విజయవంతం చేయాలి
Depression | డిప్రెషన్‌కు అందరికీ ఒకేలాంటి చికిత్స పనిచేయదు.. అధ్యయనంలో వెల్లడి..
ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
MLC Dasoju Shravan Kumar | గ్రాడ్యుయేట్స్ నడుం బిగించి ముందుకు రావాలి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

