స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌ల ప్రేమ, పెళ్లి సంగతులు డాక్యుమెంటరీగా రాబోతున్నాయి. ‘నయనతార బియాండ్ ద ఫెయిరీటేల్’ పేరుతో నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది. ఈ డాక్యుమెంటరీ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో నయనతార విఘ్నేష్ శివన్‌ల పరిచయంలోని మధుర ఘట్టాల్ని రూపొందించారు.