Showtime Movie | ‘షో టైమ్’ రివ్యూ.. నవీన్ చంద్ర కొత్త మూవీ ఎలా ఉందంటే.!
Showtime Movie | నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం షో టైమ్. ఈ సినిమాకు మదన్ దక్షిణామూర్తి దర్శకత్వం వహించగా.. అనిల్ సుంకర సమర్పకుడిగా స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిషోర్ గరికిపాటి నిర్మాతగా వ్యవహరించాడు.
నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం షో టైమ్. ఈ సినిమాకు మదన్ దక్షిణామూర్తి దర్శకత్వం వహించగా.. అనిల్ సుంకర సమర్పకుడిగా స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిషోర్ గరికిపాటి నిర్మాతగా వ్యవహరించాడు. థ్రిల్లర్ జానర్లో వచ్చిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.
కథ
ఈ చిత్రం ఒక సింపుల్ లైన్ తో సాగుతుంది. అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఒక ఇంట్లో కుటుంబం మొత్తం సరదాగా మాట్లాడుకుంటుండగా, సీఐ లక్ష్మీకాంత్ (రాజా రవీంద్ర) అర్ధరాత్రి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని వార్నింగ్ ఇస్తాడు. ఈ క్రమంలో సూర్య (నవీన్ చంద్ర), శాంతి (కామాక్షి భాస్కర్ల) మరియు సీఐ మధ్య వాగ్వాదం జరుగుతుంది. సీఐ లక్ష్మీకాంత్ ఏదైనా చేస్తాడేమో అని సూర్య భయపడే సమయంలో కథ కీలక మలుపు తిరుగుతుంది. ఈ కేసు నుండి వారు ఎలా బయటపడ్డారు, వారికి లాయర్ వరదరాజులు (వి.కె. నరేష్) ఎలా సహాయం చేశాడు అనేది తెరపైనే చూడాలి.
విశ్లేషణ:
ఈ కథ మొత్తం ఒకే రోజులో జరుగుతుంది. సింపుల్ కథను దర్శకుడు మదన్ చాలా నీట్ గా ప్రజెంట్ చేశారు. ఫస్ట్ హాఫ్ కేవలం 45 నిమిషాల నిడివితో ముగించి, అసలు కథను సెకండ్ హాఫ్ లో ప్రారంభించారు. నరేష్ కథలోకి ప్రవేశించిన తర్వాత, అక్కడ నుండి హిలేరియస్ కామెడీతో పాటు సస్పెన్స్ ను కూడా దర్శకుడు సమర్థవంతంగా హ్యాండిల్ చేశారు. ఇలాంటి సినిమాలు ఎక్కువగా మలయాళంలో వస్తుంటాయి. అలాంటి నేపథ్యంలోనే ఒకే రూమ్ లో సినిమాను ఆద్యంతం నడిపించి ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు మదన్ విజయం సాధించారు. సస్పెన్స్ లో కామెడీని మిక్స్ చేయడంలో, డైలాగ్స్ లో పదును ఉంటే అది మరింతగా వర్కౌట్ అవుతుంది. ఈ విషయంలో చిత్ర బృందం సక్సెస్ అయింది. గవిరెడ్డి శ్రీనివాస్ డైలాగ్స్ బాగా పండాయి. రాజా రవీంద్ర, నరేష్ మధ్య జరిగే ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఇక క్లైమాక్స్ ఊహించిన దానికి భిన్నంగా ఉండటం ఆకట్టుకుంటుంది.
నటీనటులు
నవీన్ చంద్ర ఇలాంటి పాత్రలకు కొత్తేమీ కాదు. ఆ అనుభవంతోనే చాలా ఈజ్ తో తన పాత్రను పోషించాడు. వి.కె. నరేష్ తనదైన మార్క్ కామెడీతో అదరగొట్టాడు. రాజా రవీంద్ర సైకో పోలీస్ పాత్రతో సినిమాను నడిపించడంలో కీలక పాత్ర పోషించాడు. కామాక్షి ఉన్నంతలో మెప్పించింది. ఇక జెమిని సురేష్ ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ పాత్రలో నవ్వించాడు.
టెక్నికల్:
శేఖర్ చంద్ర అందించిన నేపధ్య సంగీతం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్‌గా ఈ చిత్రం హిలేరియస్ గా నవ్విస్తూ.. భయపెట్టే.. షో టైమ్.
రేటింగ్ : 2.5/5
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

