నవరస నటసార్వభౌముడు.. కైకాల
Kaikala Satyanarayana | తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు కైకాల సత్యనారాణ. మహానటుడు ఎస్వీ రంగారావు నట వారసుడిగా తెలుగు సినిమా స్వర్ణయుగ చరిత్రలో ఆయనకంటూ ఒక అధ్యాయాన్ని
హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు కైకాల సత్యనారాణ. మహానటుడు ఎస్వీ రంగారావు నట వారసుడిగా తెలుగు సినిమా స్వర్ణయుగ చరిత్రలో ఆయనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకున్నారు. యమధర్మరాజు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, రావణాసురుడు, ఘటోత్కచుడు పేరుచెప్పగానే ఠక్కున గుర్తొచ్చేది సత్యనారాయణ అంటే అతిశయోక్తికాదు. తన గంభీరమైన గొంతుతో విలన్‌గా భయపెట్టిన ఆయన చక్కని టైమింగ్‌తో హాస్యాన్నీ పండించగలనని నిరూపించుకున్నారు. హీరో స్నేహితుడిగా, కమెడియన్‌గా, తండ్రిగా, తాతగా ఆకట్టుకున్నారు. ఇలా పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలు ఏవైనా తన పాత్రలో పూర్తిగా లీనమయ్యేవారు. ప్రతినాయక పాత్రల్లో అద్భుతంగా నటించిన కైకాల.. గంభీరమైన వాచకంతో మాటలను తూటాల్లా పేల్చేవారు. తనదైన ఆహార్యంతో ప్రేక్షకులను కట్టిపడేసేవారు. అబ్బురపరిచే ఆంగికంతో మేటి నటులకు సవాల్ విసిరేవారు. అందుకే అంతా కైకాలను నవరస నట సార్వభౌముడిగా పిలిచేవారు.

1958లో నిర్మాత డిఎల్ నారాయణ నిర్మించిన ‘సిపాయి కూతురు’ చిత్రంతో నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సత్యనారాయణలో ఎన్టీఆర్ పోలికలు వుండటంతో ఆయనకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టాయి. కెరీర్ ప్రారంభంలో రామారావుకు డూప్‌గా కూడా నటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తన చిత్రాల్లో ఆయనకు ప్రత్యేక వేశాలు ఇస్తూ ఆయన్ని నటుడిగా ప్రోత్సహించారు. వందకు పైగా చిత్రాల్లో ఆయనతో కైకాల పోటాపోటీగా నటించడం విశేషం.

పౌరాణికాల్లో ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో కర్ణుడిగా, ‘లవకుశ’లో భరతుడిగా, ‘నర్తనశాల’లో దుశ్శాసునుడిగా, ‘శ్రీకృష్ణపాండవీయం’లో ఘటోత్కచుడుగా, ‘దాన వీర శూర కర్ణ’లో భీముడిగా, ‘కురుక్షేత్రం’లో దుర్యోధనుడిగా, ‘సీతా కళ్యాణం’లో రావణుడిగా, సాంఘిక చిత్రాల్లో ‘యమగోల’, ‘యముడికి మొగుడు’, ‘యమలీల’ వంటి సినిమాల్లో యముడిగా మెప్పించారు. యముడు అంటే కైకాల తప్ప మరో నటుడిని ఊహించుకోనంతంగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు.






Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

