Narayana & Co | టాలీవుడ్ యువ హీరో, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ఫేం సుధాకర్ కోమాకుల (Sudhakar Komakula) నటించిన లేటెస్ట్ ప్రాజెక్ట్ నారాయణ అండ్ కో (Narayana & Co). ఈ చిత్రాన్ని చిన్న పాపిశెట్టి డైరెక్ట్ చేశాడు. ఫన్ ఎంటర్టైనర్గా జూన్ 30న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చుట్టూ తిరిగే కథతో ఫన్ ఎలిమెంట్స్‌తో ఎంటర్టైనింగ్ గా సాగుతుంది.
మధ్య తరగతి కుటుంబాన్ని లీడ్ చేసే యజమానిగా నారాయణ పాత్రలో దేవీ ప్రసాద్ ప్రేక్షకులను తనదైన శైలిలో ఎంటర్టైన్ చేయగా.. అతని భార్య పాత్రలో సీనియర్ నటి ఆమని నటించింది. నారాయణ కొడుకు పాత్రలో సుధాకర్ నటించి మెప్పించాడు. నారాయణ అండ్ కో సినిమాను థియేటర్లో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి తీసుకొచ్చారు మేకర్స్. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకేంటి మరి థియేటర్లో సినిమా మిస్సయిన వాళ్లు అమెజాన్‌లో చూసేయండి.
శ్రీనివాస్ గొర్రిపూడి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి, డాక్టర్ జోస్యభట్ల, నాగవంశి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో పూజా కిరణ్, యామిని, జయ్‌కృష్ణ, సప్తగిరి, అలీరెజా, శివ, రాగిణి, అనంత్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు.
నారాయణ అండ్ కో ట్రైలర్ ..
నారాయణ అండ్ కో టీజర్..