‘నారప్ప’..కొత్త అనుభూతి

‘35 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో సవాళ్లతో కూడిన పాత్రలు పోషించాను. ‘నారప్ప’ మాత్రం నా కెరీర్లో వైవిధ్యమైన సినిమాగా నిలిచింది’ అని అన్నారు వెంకటేష్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నారప్ప’. సురేష్‌బాబు, కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఇటీవల అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ చిత్రం విడుదలైంది. శుక్రవారం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ‘నటుడిగా నాకు సరికొత్త అనుభూతిని పంచిన చిత్రమిది. ధనుష్, వెట్రిమారన్ కలిసి ‘అసురన్’ చేసుండకపోతే ఈ సినిమా ఉండేది కాదు. తెలుగు ఆడియెన్స్‌కు కొత్తదనాన్ని అందించాలనే ఆలోచనతో రీమేక్ చేశాం. కుటుంబ సన్నివేశాల్లోని ఆర్ధ్రత ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నది. ఓటీటీలో విడుదల కావడం బాధను కలిగించినా ప్రతి ఒక్కరూ సినిమాను ఆదరిస్తున్నారు’ అని తెలిపారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘విలక్షణ కథాంశాలతో వెంకటేష్ సినిమాలు చేస్తుంటారు. నారప్ప పాత్రలో ఆయన జీవించారు’ అని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల వారిని ఈ సినిమా అలరిస్తోందని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అన్నారు. సినిమా కోసం టీమ్ పడిన కష్టం ఫలించిందని సురేష్‌బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రియమణి, కార్తిక్త్న్రం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

