నాజూకు నవ్వులోన జారుకత్తి

‘అనుబంధాల ఆలంబనతో అల్లుకున్న అందమైన పొదరిల్లు ఆ కుటుంబం. అన్నదమ్ములిద్దరికి అమ్మంటే ప్రాణం. తనయుల్ని చూసి అభినవ రామలక్ష్మణులని మురిసిపోతుంటుంది. అయితే అనుకోకుండా వారిమధ్య మనస్పర్థలొస్తాయి. బాధ్యతల్ని భుజానికెత్తుకున్న ఆ తమ్ముడు తిరిగి ప్రేమాభిమానాలు వెల్లివిరిసేలా ఆ కుటుంబాన్ని ఎలా తీర్చిదిద్దాడనే అంశాల్ని మా సినిమాలో వినోదం, భావోద్వేగాల మేళవింపుతో చూపించాం’ అన్నారు శివ నిర్వాణ. ఆయన దర్శకత్వంలో నాని హీరోగా నటించిన చిత్రం ‘టక్ జగదీష్’. రీతూవర్మ, ఐశ్వర్యరాజేష్ కథానాయికలు. జగపతిబాబు కీలక పాత్రధారి. ఈ నెల 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. శుక్రవారం గోపీసుందర్ స్వరసారథ్యంలో చిత్రంలోని ‘టక్ పాట’ను విడుదల చేశారు. ‘సల్లాటి కుండలో సల్లసక్క మనసువాడు..నువ్వు గిల్లిగిచ్చి రెచ్చగొడితే దంచుతాడు…నాజూకు నవ్వులోన జారుకత్తి పదును చూడు’ అంటూ జానపదశైలిలో ఈ పాట సాగింది. ఈ గీతాన్ని దర్శకుడు శివ నిర్వాణ ఆలపించారు. నాని పాత్ర చిత్రణలో మాస్, క్లాస్ అంశాలన్నీ ఉంటాయని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: ఎస్.తమన్, గోపీసుందర్, నిర్మాతలు: సాహుగారపాటి, హరీష్ పెద్ది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Amazon Prime
- Jagadish
- Nani
RELATED ARTICLES
తాజా వార్తలు
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

