Nani | నాని-సుజీత్ మూవీకి లైన్ క్లియర్.. టైటిల్ కూడా ఫిక్స్ అయినట్టేనా?
Nani | నేచురల్ స్టార్ నాని వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన కోర్టు చిత్రం మంచి విజయం సాధించింది. ఇక నటుడిగా హిట్ 3తో పెద్ద సక్సెస్ సాధించాడు.
Nani | నేచురల్ స్టార్ నాని వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన కోర్టు చిత్రం మంచి విజయం సాధించింది. ఇక నటుడిగా హిట్ 3తో పెద్ద సక్సెస్ సాధించాడు. ఇక ఇప్పుడు ది ప్యారడైజ్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీతోను పెద్ద హిట్ కొడతాడని భావిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ పై అభిమానులు భారీ అంచనాలు అయితే ఉన్నాయి. రియలిస్టిక్ డ్రామాగా ఈ మూవీతో సరికొత్త చరిత్ర సృష్టిస్తాడని అంటున్నారు. అయితే లైనప్ చాల పెద్దగానే ఉన్నట్టు తెలుస్తుంది. నానికి చాలా కాలం క్రితమే సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది.
అయితే సుజిత్.. పవన్ కళ్యాణ్‌తో ఓజీ చేస్తుండగా , ఈ ప్రాజెక్ట్ చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉంది. రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండటంతో మధ్యలో షూటింగ్ నిలిచినా, రీసెంట్ గా ఆయన డేట్స్ ఇచ్చి మరల సెట్స్ పైకి వచ్చారు. ఓజీ వచ్చే ఆగస్టు-సెప్టెంబర్ లో విడుదల కానుందని తెలుస్తుంది. ఆ తర్వాత సుజీత్ పూర్తి స్థాయిలో నాని ప్రాజెక్ట్ పై ఫోకస్ చేయనున్నాడు. దసరా తర్వాత ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతాయని, వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ మొదలవుతుందని టాక్ వినిపిస్తోంది. నాని రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా 2027లో రిలీజ్ అవుతుందని చెప్పడం మనం చూశాం.
ఈ ప్రాజెక్ట్ కు బ్లడీ రోమియో అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని ఇప్పటికే ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం. ఇక ఇదిలా ఉంటే నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్ సినిమాతో ఇప్పటికే రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టారు నాని. ఇప్పుడు ప్యారడైజ్ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా భారీ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

