Dacoit | అడివి శేష్ ‘డెకాయిట్’కు నాని ఫిదా.. బ్లాక్ బస్టర్ అంటూ సోషల్ మీడియా పోస్ట్
Nani On Dacoit Movie | అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ (Dacoit) నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.
Nani On Dacoit Movie | అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ (Dacoit) నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో నేచురల్ స్టార్ నాని ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు. అడివి శేష్ కెరీర్లోనే ఇది అత్యుత్తమ ప్రదర్శన అని, ‘డెకాయిట్’ ఒక నిజమైన బ్లాక్ బస్టర్ అని ఎక్స్ వేదికగా కొనియడారు.
‘డెకాయిట్’ సినిమా ప్రీమియర్ చూసిన అనంతరం నాని తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ, ‘డెకాయిట్.. ఒక నిజమైన బ్లాక్ బస్టర్! ఈ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అస్సలు మిస్ కావద్దు. అడివి శేష్ అద్భుతంగా నటించాడు, తన కెరీర్లో ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్. అడివి శేష్‌కు, రచయిత అబ్బూరి రవి గారికి, స్క్రీన్ ప్లే విభాగానికి నా అభినందనలు అని నాని పేర్కొన్నారు. అలాగే హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, ‘మృణాల్.. ఈ పాత్రలో నువ్వు చాలా అందంగా లీనమైపోయావు. నీ ఖాతాలో మరో గొప్ప సినిమా చేరింది’ అని ప్రశంసించారు. చిత్ర దర్శకుడు షనీల్ డియో పనితీరును, సంగీతాన్ని మరియు విజువల్స్‌ను నాని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. నిర్మాత సుప్రియ యార్లగడ్డ ఈ ఏడాదిలోనే ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మించారని నాని కొనియాడారు.
నాని చేసిన పోస్ట్‌పై అడివి శేష్ స్పందిస్తూ, “థాంక్యూ సో మచ్ బిగ్ బ్రో. మీ రివ్యూ చూశాక మా టీమ్ అంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీ మాటలు నాకు ఎంతో ప్రత్యేకం. నిజంగా నా మనసు నిండిపోయింది” అని కృతజ్ఞతలు తెలిపారు.
షనీల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. ఎస్.ఎస్. క్రియేషన్స్ మరియు సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్‌పై సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా, తన మాజీ ప్రేమికురాలు చేసిన ద్రోహంపై ఒక వ్యక్తి తీర్చుకునే పగ.. వారి మధ్య తలెత్తే తీవ్రమైన భావోద్వేగ సంఘర్షణల నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాకు ప్రీమియర్ నుంచే పాజిటివ్ రివ్యూలు వస్తుండటంతో ‘డెకాయిట్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
True BLOCKBUSTER with all heart.#DACOIT WHAT A FILM!
Just don’t miss this theatrical experience. @AdiviSesh was fantastic and it is his best till date. Sesh to you and Abburi Ravi gaaru and everyone in the writing and screenplay department. 👏🏼@mrunal0801 how beautifully you…— Nani (@NameisNani) April 9, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

