కశ్మీర్లో పోలీస్ వేట
హిట్' సిరీస్ చిత్రాల్లో తొలి రెండు భాగాలు థ్రిల్లింగ్, సస్పెన్స్ అంశాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. దాంతో ‘హిట్: ది థర్డ్ కేస్'పై అంచనాలు పెరిగాయి. నాని కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంతి తిపిర్నేని నిర్మాత.
‘హిట్’ సిరీస్ చిత్రాల్లో తొలి రెండు భాగాలు థ్రిల్లింగ్, సస్పెన్స్ అంశాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. దాంతో ‘హిట్: ది థర్డ్ కేస్’పై అంచనాలు పెరిగాయి. నాని కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. శ్రీనిధిశెట్టి కథానాయిక. నాని పోలీసాఫీసర్‌గా నటిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ తాజా షెడ్యూల్ కశ్మీర్లో మొదలైంది. నానితో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలతో పాటు ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో నాని పాత్ర శక్తివంతంగా ఉంటుందని, మునుపెన్నడూ చూడని రీతిలో సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తాడని చిత్ర బృందం పేర్కొంది. వచ్చే ఏడాది మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జే మేయర్, రచన-దర్శకత్వం: శైలేష్ కొలను.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

