Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Alias Rukmini | టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒకవైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు నిర్మాణ రంగంలోనూ తనదైన శైలిలో వైవిధ్యమైన ప్రాజెక్ట్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
Alias Rukmini | టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒకవైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు నిర్మాణ రంగంలోనూ తనదైన శైలిలో వైవిధ్యమైన ప్రాజెక్ట్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా రొమాంటిక్ డ్రామా ‘అలియాస్ రుక్మిణి’ చిత్రానికి నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. దీప్తి గంటా ఈ సినిమాను నిర్మిస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతున్నట్లు తెలిపింది.
‘దండోరా’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళి కాంత్ దేవోత్ ఈ సినిమాకు కథ అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. డీప్తీ గంటా యూనిసానిమస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కృష్ణ ప్రేమకథా నేపథ్యంతో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నాని, దర్శకుడు మురళిల మధ్య జరిగే సరదా సంభాషణతో సాగిన ఆ వీడియో సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచింది. ఈ చిత్రంలో నితిన్ సరసన నటిస్తున్న హీరోయిన్ వివరాలపై త్వరలోనే స్పష్టత రానుంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను అక్టోబర్ 13న వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

