Nani – Karthik Subbaraju | క్రేజీ కాంబో.. జిగర్ తండా దర్శకుడితో నాని కొత్త సినిమా.?
Nani - Karthik Subbaraju | ఈ ఏడాది మోస్ట్ సక్సెస్ఫుల్ టాలీవుడ్ హీరో ఎవరంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు నేచురల్ స్టార్ నాని (Nani). ఈ ఇయర్ దసరా (Dasara) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నాని.. ఇటీవలే హాయ్ నాన్న(Hi Nanna) లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో మరో హిట్ అందుకున్నాడు.
Nani – Karthik Subbaraju | ఈ ఏడాది మోస్ట్ సక్సెస్ఫుల్ టాలీవుడ్ హీరో ఎవరంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు నేచురల్ స్టార్ నాని (Nani). ఈ ఇయర్ దసరా (Dasara) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నాని.. ఇటీవలే హాయ్ నాన్న(Hi Nanna) లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో మరో హిట్ అందుకున్నాడు. కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో రన్ అవుతుంది. ఇక ఈ సినిమా అనంతరం నాని వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్లో ఉండగానే నాని మరో స్టార్ దర్శకుడితో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇంతకి ఆ దర్శకుడు ఎవరో కాదు జిగర్ తండా డబుల్ ఎక్స్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్న తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు.
నాని తన తదుపరి ప్రాజెక్ట్ కార్తీక్ సుబ్బరాజుతో చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నానిని కలిసిన సుబ్బరాజు ఒక లైన్ ను వినిపించాడట. ఆ లైన్ నానికి బాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కథ చర్చల్లో ఉన్న ఈ ప్రాజెక్టు పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇక ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ప్రోడ్యూస్ చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

