Hi Nanna | అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తున్న హాయ్ నాన్న..!
Hi Nanna | హాయ్ నాన్న.. ఇటీవల రిలీజై సైలెంట్ హిట్ కొట్టిన సినిమా. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. నాని, మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీ కూడా క్యూట్‌గా ఉంది. అందుకే సినిమా విడుదలై 20 రోజులు దాటినా ఇంకా థియేటర్లకు జనాలు వస్తున్నారు.
Hi Nanna | హాయ్ నాన్న.. ఇటీవల రిలీజై సైలెంట్ హిట్ కొట్టిన సినిమా. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. నాని, మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీ కూడా క్యూట్‌గా ఉంది. అందుకే సినిమా విడుదలై 20 రోజులు దాటినా ఇంకా థియేటర్లకు జనాలు వస్తున్నారు. అంటే ఈ సినిమా ప్రేక్షకుల మనసులను ఎంతగా దోచేసేందో అర్థం చేసుకోవచ్చు. సలార్, డంకీ వంటి భారీ సినిమాలు వచ్చినా కూడా ఇప్పటికీ ఇంకా థియేటర్లలో సందడి చేస్తున్న హాయ్ నాన్న సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఇప్పుడు ఒక వార్త వైరల్‌గా మారింది.
నాని, మృణాల్ ఠాకూర్ జంటగా వచ్చిన హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న విడుదలైంది. మొదట్లో ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. సినిమా చాలా క్లాస్‌గా ఉందని అనుకున్నారు. కానీ మెల్లమెల్లగా సినిమా జనాలకు ఎక్కింది. అందుకే 20 రోజులు అయిపోయినా కూడా థియేటర్లో రన్ అవుతుంది. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించింది. ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం హాయ్ నాన్న సినిమాను సంక్రాంతి పండుగ తర్వాత అంటే జనవరి మూడో వారం లేదా నాలుగో వారంలో ఓటీటీలోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. జనవరి మొదటి వారంలోనే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తున్నది. ఒకవేళ అదే నిజమైతే.. సినిమా రిలీజైన 28 రోజుల తర్వాత అంటే జనవరి 5 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Hi Nanna
- Mrunal thakur
- Nani
- netflix
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

