Nagarjuna | నా సామిరంగ.. అందమైన పాటలా అద్భుతంగా తీశారు: నాగార్జున
విజయ్ బిన్నీ ‘నా సామిరంగ’ సినిమాను అందమైన పాటలా చాలా అద్భుతంగా తీశారని అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున అన్నారు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. కొరియోగ్రాఫర్ నేపథ్యమున్న విజయ్ బిన్నీ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు.
Nagarjuna | విజయ్ బిన్నీ ‘నా సామిరంగ’ సినిమాను అందమైన పాటలా చాలా అద్భుతంగా తీశారని అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున అన్నారు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. కొరియోగ్రాఫర్ నేపథ్యమున్న విజయ్ బిన్నీ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదలై చక్కటి టాక్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్, టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ గురువారం అభినందన సభ ఏర్పాటుచేసింది.
నాగార్జున, అల్లరి నరేశ్ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కంగ్రాట్స్ మీట్లో ‘నా సామిరంగ’ చిత్ర బృందాన్ని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. నాగార్జున మాట్లాడుతూ ‘విజయ్‌తో పనిచేయడం అద్భుత అనుభవాన్నిచ్చింది. మా అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కళ్లు మూసి తెరిచేలోగా చక్కగా సినిమాను పూర్తిచేశాడు.. ఒక పాటలా చాలా అందంగా తీశాడు. కొరియోగ్రాఫర్ అనిపించుకున్నాడు. నేను 95కు పైగా సినిమాలు చేశాను. క్లారిటీతో ఉన్న అతికొద్ది మంది దర్శకుల్లో విజయ్ ఒకరు. విజయ్‌కి, డ్యాన్సర్స్ అసోసియేషన్‌కి ఆల్ ది బెస్ట్’ అని చెప్పారు. ‘నాగార్జున గారు ఇచ్చిన ప్రేమను మర్చిపోలేను. ఆయనే నన్ను దర్శకుడిని చేశారు. డైరెక్టర్ కావాలని ఆశపడుతున్న చాలా మంది కొరియోగ్రాఫర్స్‌కి అందరి సపోర్ట్ కావాలి’ అని దర్శకుడు విజయ్ బిన్నీ అన్నారు. కార్యక్రమంలో శేఖర్ మాస్టర్, సుజాత మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

