Nagabandham | ‘నాగబంధం’ రిలీజ్‌కు ముందు బంపర్ ఆఫర్.. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కొత్త ప్లాన్!
Nagabandham | పౌరాణిక అంశాలు, ఫాంటసీ అడ్వెంచర్, థ్రిల్లింగ్ కథాంశంతో తెరకెక్కిన 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' సినిమా జులై 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు అభిషేక్ నామా రూపొందించిన ఈ చిత్రంలో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు
Nagabandham | పౌరాణిక అంశాలు, ఫాంటసీ అడ్వెంచర్, థ్రిల్లింగ్ కథాంశంతో తెరకెక్కిన ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ సినిమా జులై 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు అభిషేక్ నామా రూపొందించిన ఈ చిత్రంలో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. విడుదలకు ముందే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడగా, ఇప్పుడు మేకర్స్ మరో ప్రత్యేక నిర్ణయంతో అందరి దృష్టిని ఆకర్షించారు. సినిమా విడుదల రోజునే ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించేందుకు చిత్ర బృందం ‘బై వన్ గెట్ వన్’ (BOGO) ఆఫర్‌ను ప్రకటించింది. ఒక టికెట్ కొనుగోలు చేస్తే మరో టికెట్ ఉచితంగా అందించే ఈ స్కీమ్‌ను తొలి రోజు నుంచే అమలు చేస్తున్నారు.
ఇటీవల బాలీవుడ్ సినిమాల్లో ఇలాంటి ప్రమోషనల్ ఆఫర్లు ఎక్కువగా కనిపిస్తుండగా, ఇప్పుడు తెలుగు సినిమాల్లో కూడా ఈ తరహా మార్కెటింగ్ వ్యూహాలు చోటుచేసుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ ఆఫర్ కేవలం హిందీ వెర్షన్‌కు మాత్రమే వర్తిస్తుందని చిత్ర బృందం స్పష్టం చేసింది. తెలుగు లేదా ఇతర భాషల వెర్షన్లకు ఈ సదుపాయం ఉండదు. ‘నాగబంధం’ను అత్యంత భారీ నిర్మాణ విలువలతో రూపొందించారు. పౌరాణిక కథాంశానికి ఆధునిక విజువల్ ఎఫెక్ట్స్‌ను జోడిస్తూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా సినిమాను తీర్చిదిద్దినట్లు మేకర్స్ చెబుతున్నారు. ముఖ్యంగా సినిమాలో ఉపయోగించిన VFX, ఫాంటసీ ప్రపంచం, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనున్నాయని ప్రచార చిత్రాలు సూచిస్తున్నాయి.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అడ్వెంచర్ అంశాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ఈ చిత్రంలో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్‌తో పాటు సీనియర్ నటులు జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, దక్ష నగర్కర్, రిషభ్ సాహ్నీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కథలో ప్రతి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండేలా దర్శకుడు అభిషేక్ నామా రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. రిలీజ్‌కు ముందే మంచి బజ్‌ను సొంతం చేసుకున్న ‘నాగబంధం’కు BOGO ఆఫర్ ఎంతవరకు ఉపయోగపడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా హిందీ మార్కెట్లో ఈ వ్యూహం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఎంత మేర సక్సెస్ అవుతుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

