సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది
పురాణ రహస్యాలు, దివ్యశక్తుల మహిమలు, సాహసభరితమైన అంశాల కలయికతో శుక్రవారం విడుదలైన ‘నాగబంధం’ ట్రైలర్ విజువల్ ఫీస్ట్‌లా సాగింది. విరాట్‌కర్ణ కథానాయకుడిగా అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ‘నాగబంధం-ది సీక్రెట్ ట్రెజర్' ట్రైలర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.
పురాణ రహస్యాలు, దివ్యశక్తుల మహిమలు, సాహసభరితమైన అంశాల కలయికతో శుక్రవారం విడుదలైన ‘నాగబంధం’ ట్రైలర్ విజువల్ ఫీస్ట్‌లా సాగింది. విరాట్‌కర్ణ కథానాయకుడిగా అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ‘నాగబంధం-ది సీక్రెట్ ట్రెజర్’ ట్రైలర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. శతాబ్దాల నాటి రహస్యం చుట్టూ నడిచిన ఈ కథలో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో భద్రపరచబడిన పవిత్రమైన బ్రహ్మకమలం కీలకమైన అంశంగా కనిపించింది.
తరాలుగా రక్షింపబడుతున్న బ్రహ్మ కమలంను స్వాధీనం చేసుకోవాలనే దుష్టశక్తుల పన్నాగాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. శివుడి ఆవిర్భావం, నాగసాధువుల ప్రవేశం ట్రైలర్లో ఉత్కంఠను పంచాయి. ఈ సినిమా అద్భుతమైన థియేట్రికల్ అనుభూతినందిస్తుందని, టీమ్ అంతా ఓ విజన్‌తో పనిచేశామని, నిర్మాణపరంగా అత్యున్నతంగా ఉంటుందని దర్శకుడు అభిషేక్ నామా తెలిపారు. ఈ సినిమా చేయడం దైవానుగ్రహమని, మన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే చిత్రమిదని నిర్మాత కిషోర్ అన్నపురెడ్డి తెలిపారు. పురాతన ఆలయాల రహస్యాన్ని రాబోవు తరాలకు తెలియజేప్పే చిత్రమిదని హీరో విరాట్‌కర్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు అబి-జునైద్‌తో పాటు యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

