Naga Shaurya | ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చేసిన నాగ శౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’.. ఇప్పుడు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Naga Shaurya |టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ థియేటర్లలో పెద్దగా హడావుడి లేకుండానే విడుదలై ప్రేక్షకుల దృష్టిని పెద్దగా ఆకర్షించలేకపోయింది. సినిమా విడుదలైన విషయం కూడా చాలామందికి తెలియని పరిస్థితి నెలకొనగా, ఇప్పుడు ఇదే చిత్రం ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేయడం ఆసక్తికరంగా మారింది.
Naga Shaurya |టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ థియేటర్లలో పెద్దగా హడావుడి లేకుండానే విడుదలై ప్రేక్షకుల దృష్టిని పెద్దగా ఆకర్షించలేకపోయింది. సినిమా విడుదలైన విషయం కూడా చాలామందికి తెలియని పరిస్థితి నెలకొనగా, ఇప్పుడు ఇదే చిత్రం ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేయడం ఆసక్తికరంగా మారింది.ఈ సినిమాకి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఇప్పటికే ఈ చిత్రం ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంటి వద్ద నుంచే ఈ సినిమాను వీక్షించే అవకాశం పొందుతున్నారు.
‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రానికి కొత్త దర్శకుడు రమేష్ దేసిన దర్శకత్వం వహించారు. సినిమా యాక్షన్ ఎపిసోడ్స్‌ను స్టైలిష్‌గా తెరకెక్కించినప్పటికీ, ప్రధాన కథా కథనాలు మాత్రం పాత తరహాలో సాగడంతో ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా స్క్రీన్‌ప్లేలో కొత్తదనం లేకపోవడం సినిమాకు ప్రధాన మైనస్‌గా మారిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రంలో శ్రీదేవి విజయ్ కుమార్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించగా, హీరోయిన్గా విధి యాదవ్ కనిపించింది. సంగీత దర్శకుడు హరీష్ జైరాజ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. నిర్మాణ బాధ్యతలను నిర్మాత శ్రీనివాసరావు చింతలపూడి నిర్వహించారు. థియేటర్లలో నిరాశపరిచిన ఈ చిత్రం ఓటీటీలో అయినా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ముఖ్యంగా యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఒకసారి ట్రై చేయవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

