‘ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది. దర్శకుడు రామ్ దేశిన చాలా కష్టపడి ఈ సినిమాను తీర్చిదిద్దారు. శ్రీదేవి విజయ్‌కుమార్, వెన్నెల కిశోర్, సముద్రఖని.. ఇలా చాలా పెద్ద తారాగణం ఈ సినిమాలో ఉంది. అద్భుతమైన కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రం సాంకేతికంగా కూడా ఆకట్టుకుంటుంది’ అన్నారు హీరో నాగశౌర్య. ఆయన కథానాయకుడిగా రూపొందిన ఇంటెన్స్ మాస్ డ్రామా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. రామ్ దేశిన దర్శకుడు. విధి కథానాయిక. శ్రీనివాసరావు చింతలపూడి నిర్మాత. ఈ నెల 17న సినిమా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో నాగశౌర్య మాట్లాడారు. రసూల్ విజువల్స్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని, నాగశౌర్యతో పనిచేయడం గొప్ప అనుభవమని శ్రీదేవి విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఇది ఆద్యంతం వినోదాత్మకంగా సాగే సినిమా అని, నాగశౌర్య డిఫరెంట్ ైస్టెల్లో కనిపిస్తారని, జూన్‌లో మరో సినిమా మొదలుపెట్టబోతున్నామని నిర్మాత శ్రీనివాసరావు చింతలపూడి చెప్పారు. ఇంకా అశోక్, జీ స్టూడియోస్ గిరీష్, హీరోయిన్ విధి, నటి ప్రియ, డీవోపీ రసూల్ కూడా మాట్లాడారు.