Phalana Abbayi Phalana Ammayi | చాలా రోజులుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నటుడు నాగశౌర్య. ఊహలు గుసగుసలాడే చిత్రంతో బ్రేక్ తెచ్చుకున్న నాగశౌర్య.. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. వరుడు కావలెను, లక్ష్య, కృష్ణ వ్రింద విహారి వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ అవేవీ అతనికి సక్సెస్ ఇవ్వలేకపోయాయి. దీంతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే తపనతో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. అదే ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. మాళవిక నాయర్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది.
చదువుకునే రోజుల్లో బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్న ఇద్దరి మధ్య ఎలా పుట్టింది? వారి జర్నీ ఎలా జరిగిందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. డిఫరెంట్ ఏజెస్‌లో వాళ్ల ప్రయాణం ఎలా సాగిందనేది స్టోరీ లైన్‌గా అర్థమవుతోంది. ఈ టీజర్ మొత్తంలో కూడా నాగశౌర్య, మాళవిక నాయర్ మాత్రమే కనిపించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే ఉంది. సినిమాలో రొమాంటిక్, ముద్దు సీన్లు కూడా ఉన్నాయి. మొత్తంగా టీజర్ మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ సినిమాతో అయినా నాగశౌర్య హిట్ కొడతాడో లేదో చూడాలి.