Tandel | నమో నమః శివాయ.. భక్తి భావాలను మేల్కొలిపేలా తండేల్ పాట
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్' చిత్రం నుంచి శివుడి నేపథ్యంలో భక్తి ప్రధానంగా తెరకెక్కించిన ‘నమో నమః శివాయ’ పాటను శనివారం విడుదల చేశారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
Tandel | నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్’ చిత్రం నుంచి శివుడి నేపథ్యంలో భక్తి ప్రధానంగా తెరకెక్కించిన ‘నమో నమః శివాయ’ పాటను శనివారం విడుదల చేశారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ‘నమో నమః శివాయ’ పాటకు దేవిశ్రీప్రసాద్ స్వరాల్ని సమకూర్చగా, జొన్నవిత్తుల సాహిత్యాన్ని అందించారు. అనురాగ్ కులకర్ణి, హరిప్రియ ఆలపించారు.
శేఖర్ మాస్టర్ నృత్యరీతుల్ని అందించారు. కళాత్మక, ఆధ్యాత్మికత కలబోతగా మహా శివుడి నామస్మరణతో ఈ పాట భక్తి భావాలను మేల్కొలిపే విధంగా సాగింది. నాగచైతన్య, సాయిపల్లవి చక్కటి నృత్యాలతో మెస్మరైజ్ చేశారు. సర్వశక్తివంతుడైన శివుడి ఔన్నత్యాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాటను తెరకెక్కించామని, సినిమాకు ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు.
మత్య్యకారుల జీవితం నేపథ్యంలో ప్రేమ, దేశభక్తి ప్రధానాంశాలుగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్, సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాత: బన్నీ వాసు, రచన-దర్శకత్వం: చందూ మొండేటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

