Naga Chaitanya First Look Poster | యువ సామ్రాట్ నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ‘లవ్‌స్టోరి’, ‘బంగార్రాజు’ వంటి వరుస హిట్లతో జోరు మీదున్న చైతన్య ‘థాంక్యూ’తో హ్యాట్రిక్ సాధించడానికి రెడీ అవుతున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 22న విడుదల కానుంది. ఇక చైతన్య నటించిన మరో చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుండి నాగచైతన్య ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిరంజీవి విడుదల చేశాడు.
ఈ చిత్రంలో నాగచైతన్య ‘బాలరాజు’ పాత్రలో.. దక్షిణాదికి చెందిన ఆర్మీ అధికారిగా నటించాడు. లేటెస్ట్గా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 11న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి తెలుగులో చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ‘రుద్రవీణ’, ‘త్రినేత్రుడు’ తర్వాత చిరు ఈ సినిమాను సమర్పించడం విశేషం అనే చెప్పాలి.
ఇక నాగచైతన్య ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘ధూత’ అనే వెబ్ సిరీస్‌ను చేస్తున్నాడు. హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తుంది. దీని తర్వాత ‘మానాడు’ ఫేం వెంకట్ ప్రభు దర్శకత్వంలో యాక్షన్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రంలో చైతన్య పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు.
‘లాల్ సింగ్ చడ్డా’, చెడ్డీ బడ్డీ ‘బాలరాజు’ ని మీకు పరిచయం చేస్తున్నాను.
అలనాటి ‘బాలరాజు’ మనవడు మన
అక్కినేని నాగ చైతన్యే ఈ బాలరాజు. @chay_akkineniIntroducing #Balaraju
from #LaalSinghChaddha #AamirKhan @AKPPL_Official @Viacom18Studios #LaalSinghChaddhaOnAUG11th pic.twitter.com/1cVgbURrZx— Chiranjeevi Konidela (@KChiruTweets) July 20, 2022