ఆమిర్‌ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టారు నాగ చైతన్య. చిరంజీవి సమర్పణలో ఈ సినిమా ఇవాళ తెలుగులో విడుదలవుతున్నది. నాగ చైతన్య మాట్లాడుతూ..ఇందులో నా పాత్ర పేరు బాలరాజు. గుంటూరు దగ్గర ఓ చిన్న ఊరి నుంచి సైన్యంలో చేరేందుకు వెళ్తాడు. సైన్యంలో అతను ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అనేది ఆసక్తికరంగా ఉంటుంది. అతని పాత్ర ఆకట్టుకుంటుంది. ఆమిర్ ఖాన్‌తో కలిసి నా పాత్ర దాదాపు 30 నిమిషాల పాటు సాగుతుంది. కంటెంట్ బాగుంటే థియేటర్‌కు ప్రేక్షకులు వస్తారని గత వారం రెండు చిత్రాలు ‘బింబిసార’, ‘సీతారామం’ నిరూపించాయి. మొదటి బాలీవుడ్ చిత్రం కావడం, పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు వస్తుండటంతో కొంత ఒత్తిడికి లోనవుతున్నా. అయితే హిందీలోనూ పరిచయమై, అక్కడి పరిశ్రమకు దగ్గర కావడం సంతోషంగా ఉంది. జీవితంలో ఏం జరిగినా సంతోషంగా అన్నారు.
ఆ టాటూ వేసుకోవద్దు
‘నా చేతిపై ఉన్న టాటూను కొందరు అభిమానులు కాపీ కొడుతున్నారు. అది నా పెళ్లి తేదీ. దాన్ని వేసుకోకండి’ అన్నారు నాగ చైతన్య. సమంతతో విడిపోయినా ఆ పచ్చబొట్టు వల్ల ఎలాంటి ఇబ్బంది లేనందునే ఉంచుకున్నా అని చెప్పారు.