జబర్ధస్త్‌కు నాగబాబు గుడ్ బై ఎందుకు చెప్పాడో తెలుసా?

ఆరెంజ్ సినిమా ఓ రేంజ్ లో ఫ్లాప్ అయిన తర్వాత నిర్మాతగా, నటుడిగా చాలా డౌన్ లోకి వెళ్లిపోయాడు నాగబాబు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు కూడా. అయితే పిల్లలు గుర్తుకొచ్చి ఆగిపోయానని చెప్పాడు ఈయన. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు నిలదొక్కకుని మళ్లీ నిలబడ్డాడంటే దానికి కారణం జబర్దస్త్ కామెడీ షో. ఒకటి రెండు కాదు.. ఏడేళ్ల పాటు ఈ షోలో జడ్జిగా ఉన్నాడు ఈయన. మధ్యలో తనకు తెలిసిన ఇన్ పుట్స్ ఇచ్చాడు. ఆ షో సక్సెస్ కావడానికి నాగబాబు కూడా తనవంతు బాధ్యతను నిర్వర్తించాడు. ఆ షోలో ఆయన నవ్వులకు కూడా మంచి డిమాండ్ ఉండేది. అయితే రెండేళ్ల కింద ఉన్నట్లుండి జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేసాడు నాగబాబు. జీ తెలుగుకు వెళ్లి అక్కడ అదిరింది ప్రోగ్రామ్ మొదలు పెట్టాడు.
కొన్ని రోజులు బాగానే నడిచినా తర్వాత ఆగిపోయింది. అయితే జబర్దస్త్ షో నుంచి నాగబాబు ఎందుకు వెళ్లిపోయాడనేది చాలా మంది చాలా కారణాలు చెప్పారు. సింపుల్ డబ్బులు ఎక్కువిస్తున్నారు అక్కడ్నుంచి ఇక్కడికి వచ్చేసాడు.. అంతకంటే మరో కారణాలు కూడా కనిపించడం లేదు.. ఈటీవీ నుంచి ఇప్పుడు జీ టీవీకి మారిపోయాడు అంటూ చెప్పుకొచ్చారు. కానీ వెళ్లిపోయే సమయంలో మాత్రం మల్లెమాలపై చాలా సీరియస్ కామెంట్స్ చేసాడు నాగబాబు. జబర్దస్త్ కామెడీ షోను ఓ రకంగా నిందించాడు. అక్కడ పద్దతులను తప్పు పట్టాడు. పైన తెలిసి జరుగుతుందో లేదో తనకు తెలియదు కానీ చాలా తప్పులు జరుగుతున్నాయని విమర్శించాడు నాగబాబు.
ఇన్నేళ్లూ డబ్బులు తీసుకుని వెళ్ళే ముందు అలా విమర్శించడం కరెక్ట్ కాదు అంటూ నాగబాబును అప్పుడు విమర్శించిన వాళ్లు కూడా లేకపోలేదు. ఇదిలా ఉంటే ఈయన బయటకు వచ్చేయడానికి కారణం ఇప్పుడు ఆయన నోటితోనే చెప్పాడు. జబర్దస్త్ కామెడీ షోను వదిలేసి రెండేళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఈయన్ని ప్రశ్నలు మాత్రం వెంటాడటం ఆగలేదు. తాజాగా అభిమానులతో ఛాట్ చేసిన ఈయన్ని మరోసారి ఫ్యాన్స్ ఇదే ప్రశ్నలు అడిగారు. మీరెందుకు జబర్దస్త్ కామెడీ షోను వదిలేసారు సర్ అని అడిగితే మరో ఆలోచన లేకుండా ఐడియాలిజికల్ డిఫెరెన్స్ అంటూ సమాధానమిచ్చాడు. అంటే కొన్ని క్రియేటివ్ డిఫెరెన్సుల కారణంగానే బయటికి వచ్చానని క్లారిటీ ఇచ్చాడు నాగబాబు. ఆయన స్థానంలో చాలా మందిని ట్రై చేసిన తర్వాత ఇప్పుడు మనో ఫిక్సయ్యాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- jabardasth
- naga babu
- rumors
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

