Kalki 2898 AD | మే 9న ప్రేక్షకుల ముందుకు ‘కల్కి 2898 ఏడీ’.. ఆ సెంటిమెంట్ కొనసాగుతుందా?
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ దశ నుంచే పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. భారతీయ పౌరాణిక ఇతిహాసాల స్ఫూర్తితో ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
Kalki 2898 AD | ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ దశ నుంచే పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. భారతీయ పౌరాణిక ఇతిహాసాల స్ఫూర్తితో ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికాపడుకోన్ వంటి అగ్ర తారలు ఈ సినిమాలో భాగం కావడంతో దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్రకటించింది.
ఈ సందర్భంగా శుక్రవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. నిర్మాత సి.అశ్వనీదత్ మాట్లాడుతూ ‘మే నెల 9వ తేదీ మా సంస్థకు సెంటిమెంట్. మేము తెరకెక్కించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ ‘మహానటి’ ‘మహర్షి’ చిత్రాలు అదే తేదీన విడుదలైన అపూర్వ ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నాయి. ఆ సెంటిమెంట్‌ను పునరావృతం చేస్తూ ‘కల్కి’ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నాం’ అన్నారు. కొద్ది మాసాల క్రితం విడులద చేసిన ఈ చిత్ర టీజర్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

