Kalki 2 | కల్కి 2898 AD సీక్వెల్‌పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్లారిటీ… ఇంకా 2–3 ఏళ్లు పట్టే ఛాన్స్!
Kalki 2 | ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు, సైన్స్ ఫిక్షన్ ప్రేమికులు ‘కల్కి 2898 AD’ సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కీలక అప్డేట్ బయటకు వచ్చింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొని ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
Kalki 2 | ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు, సైన్స్ ఫిక్షన్ ప్రేమికులు ‘కల్కి 2898 AD’ సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కీలక అప్డేట్ బయటకు వచ్చింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొని ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతేడాది జూన్ 27న విడుదలైన ‘కల్కి 2898 AD’ భారీ విజువల్ వండర్‌గా మారింది. ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ క్యాస్ట్ ఈ చిత్రంలో నటించడంతో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. భారీ విఎఫ్ఎక్స్, యూనిక్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల మన్ననలు పొందింది.
ఈ బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత ఇప్పుడు దృష్టి మొత్తం సీక్వెల్‌పై పడింది., ఈ ఏడాది చివర్లో ‘కల్కి’ సీక్వెల్‌ను సెట్స్‌పైకి తీసుకువెళ్లాలనే ప్లాన్ ఉంది. కానీ ఇది పక్కా కాదు. ఫస్ట్ పార్ట్‌ను మించిపోయేలా సినిమా ఉంటే మాత్రమే సంతృప్తిగా ఉంటుంది. యాక్టర్స్ అందరూ బిజీగా ఉన్నారు, వారి డేట్స్ కుదిరితేనే ముందుకు వెళ్లగలుగుతాం. ప్రీ-విజువలైజేషన్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఎక్కువగా ఉంటాయి. అవన్నీ సెట్ చేయడానికి, కంప్లీట్ చేయడానికి టైం పడుతుంది. పోస్ట్ ప్రొడక్షన్‌కు మరింత సమయం అవసరం. నేను ఊహించిన ప్రకారం ఇంకో 2–3 ఏళ్లు పట్టే ఛాన్స్ ఉంది అని నాగ్ అశ్విన్ అన్నారు.
నాగ్ అశ్విన్ వ్యాఖ్యల ప్రకారం, ప్రభాస్‌ను మళ్లీ కర్ణుడిగా చూడాలంటే అభిమానులు 2027 లేదా 2028 వరకు ఓపిక పట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ పనులు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. సెట్ వర్క్ మొదలైన తర్వాత స్పీడ్ పెంచే అవకాం ఉంది. విజన్‌ను తగ్గించకుండా, క్వాలిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ దర్శకుడు నాగ్ అశ్విన్.. సెకండ్ పార్ట్‌ను ఫస్ట్ పార్ట్‌కు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మరోసారి భారత సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పనుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. గతంలో అశ్వినీదత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్, కమల్, అమితాబ్ మధ్యనే సెకండ్ పార్ట్‌లో ఎక్కువ సన్నివేశాలు ఉంటాయని చెప్పుకొచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- amitabh
- Kalki
- kalki2
- kamal hassan
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

