Naatu Naatu: జెలెన్స్కీ ఇంటిముందే నాటు నాటు సాంగ్ షూటింగ్…
Naatu Naatu shot In Ukraine నాటు నాటు ఇప్పుడో పాపులర్ ట్రాక్. కీరవాణి కొట్టిన ఆ మ్యూజిక్కు గోల్డెన్ గ్లోబ్ మన ఖాతాలో పడింది. ఫుల్ మాస్ ఎంటైర్‌టైనింగ్ బీట్‌గా సాగిన ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఉర్రూతలూగించింది. ఈ సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న బిల్డింగ్ ఓ అద్భుత కట్టడం. దానికొక ప్రత్యేక చరిత్ర ఉంది. ఉక్రెయిన్ ప్రస్తుత అధ్యక్షుడు వోల్డోమర్ జెలెన్స్కీ ఇంటి ముందే ఆ బిల్డింగ్ ఉంది. కేక పుట్టించే రీతిలో సాగిన
హైదరాబాద్: నాటు నాటు ఇప్పుడో పాపులర్ ట్రాక్. కీరవాణి కొట్టిన ఆ మ్యూజిక్కు గోల్డెన్ గ్లోబ్ మన ఖాతాలో పడింది. ఫుల్ మాస్ ఎంటర్టైనింగ్ బీట్‌గా సాగిన ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఉర్రూతలూగించింది. ఈ సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న బిల్డింగ్ ఓ అద్భుత కట్టడం. దానికొక ప్రత్యేక చరిత్ర ఉంది. ఉక్రెయిన్ ప్రస్తుత అధ్యక్షుడు వోల్డోమర్ జెలెన్స్కీ ఇంటి ముందే ఆ బిల్డింగ్ ఉంది.
కేక పుట్టించే రీతిలో సాగిన సాంగ్ కోసం ఈ బ్యూటిఫుల్ బిల్డింగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌గా ఎంచుకున్నారు. స్టోరీకి బ్రిటీష్ టచ్ ఉన్న కారణంగా.. ఆ పాట కోసం ఇలాంటి అందమైన బిల్డింగ్‌ను ఎంచుకోవాల్సి వచ్చింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం కావడానికి ముందే ఈ సాంగ్ షూటింగ్ అక్కడ జరిగింది.
మరినిస్కీ ప్యాలెస్ ముందు ఈ కలర్‌ఫుల్ బిల్డింగ్ ఉంది. కథా నేపథ్యానికి తగినట్లు నాటు నాటు సాంగ్‌కు ఈ బ్యాక్‌గ్రౌండ్ ఫిక్స్ చేశారు. బ్లూ కలర్ బిల్డింగ్.. బార్బిక్యూ ఆర్కిటెక్చర్‌తో సాంగ్‌లో ఆకట్టుకుంటోంది. ఆ పాట షూట్ చేసే సమయానికి జెలెన్స్కీ అధ్యక్షుడయ్యారు. అంతకుముందు ఆయన ఓ ప్రఖ్యాత టీవీ స్టార్.
అధ్యక్ష పాత్రలో ఆయన చేసిన ఓ టీవీ సీరిస్ అక్కడ చాలా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే టీవీ స్టార్ కావడం వల్లే .. పాట షూటింగ్‌కు జెలెన్స్కీ అనుమతి ఇచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి తెలిపారు.
ఇవాళ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవ సమయంలో.. జెలెన్స్కీ ఇచ్చిన సందేశ వీడియోను ప్లే చేశారు. మూడవ ప్రపంచ యుద్ధం జరగదని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏడాది కాలం నుంచి యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

