ఎన్టీఆర్-రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ జనవరి 7న విడుదల కానుండగా, మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. సమయాన్ని బట్టి ఒక్కో సాంగ్ విడుదల చేస్తూ వస్తున్నారు. ఈ సినిమా లోని నాటు నాటు సాంగ్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు తో పాటు అన్ని భాషల్లో కూడా విడుదల అయిన నాటు నాటు సాంగ్ ఇటీవలే 80 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుంది.
నాటు నాటు పాటకు గాను యూట్యూబ్ లో అరుదైన రికార్డు దక్కింది. తెలుగు సినిమాలకు చెందిన ఏ పాటలు కూడా యూట్యూబ్ లో మిలియన్ లైక్స్ మూడు వారాల వ్యవధిలో దక్కించుకోలేక పోయాయి. కాని నాటు నాటు సాంగ్ మాత్రం కేవలం మూడు వారాల్లోనే మిలియన్ లైక్స్ ను దక్కించుకుంది. ఆ సాంగ్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల ఊరమాస్ డ్యాన్స్ ఈ రికార్డ్ దక్కడంలో భాగమైంది. వెండితెరపై ఈసాంగ్ని వీక్షించాలని చాలా మంది కలలు కంటున్నారు. చిత్రంలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజులుగా ఎంత రచ్చ చేస్తారా అని ఊహాలోచనలు చేస్తున్నారు. త్వరలోనే మూవీ ట్రైలర్ విడుదల కానుంది.