Renu Desai | నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?.. ‘మాజీ భార్య’ ట్యాగ్‌పై నటి రేణు దేశాయ్ ఆవేదన
Renu Desai | నటి, నిర్మాత రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
నటి, నిర్మాత రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. విడాకులు తీసుకుని సుమారు 14 సంవత్సరాలు గడిచినా, సమాజం తనను కేవలం పవన్ కల్యాణ్ మాజీ భార్యగానే చూస్తోందని.. తనకంటూ ఒక స్వతంత్ర గుర్తింపు ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితంలోని కష్టాలు, ఎదుర్కొంటున్న ట్రోలింగ్‌పై కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ సందర్భంగా రేణు దేశాయ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. చాలామంది నా జీవితం ‘బద్రి’ సినిమాతోనే ప్రారంభమైందని భావిస్తారు. అంతకుముందు నాకు ఎలాంటి జీవితమే లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. మాకు అధికారికంగా విడాకులు వచ్చి 14 ఏళ్లు పూర్తయ్యాయి. శ్రీరాముడు కూడా 14 ఏళ్లు మాత్రమే వనవాసం చేశాడు. మరి నా ఈ మానసిక క్షోభ, వనవాసం ఎప్పుడు ముగుస్తుంది? అంటూ తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు.
తన సొంత ప్రతిభ, విజయాల గురించి ప్రస్తావిస్తూ.. 2012లో విడాకులు తీసుకున్న తర్వాత నేను కేవలం ఖాళీగా కూర్చోలేదు. సొంతంగా ఒక మరాఠీ సినిమాను నిర్మించాను, అది బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఆ తర్వాత మరో చిత్రానికి కథ అందించడంతో పాటు దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు కూడా నేనే స్వయంగా నిర్వహించాను. అంతేకాకుండా, పలు టీవీ డ్యాన్స్ షోలకు పనిచేశాను, కవితలు రాశాను, ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటిస్తున్నాను. నాకంటూ ఎలాంటి వ్యక్తిగత గుర్తింపు, టాలెంట్ లేకపోతే నాకు ఇన్ని రంగాల్లో అవకాశాలు ఎందుకు వస్తాయి? అని ఆమె ప్రశ్నించారు. సమాజంలో కొందరు వ్యక్తులు ఆయన లేకపోతే అసలు ఆమెకు బతికే అర్హతే లేదు అన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఇతరుల జీవితాలను విమర్శించే ముందు కాస్త ఆలోచించాలి అని ఆమె పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్ల లేకుండే..! హరీశ్ రావు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతులు
Muscles | వృద్ధాప్యంలో కండరాలు బలంగా ఎలా ఉంటాయి.. ఏయే అంశాలు దోహదం చేస్తాయి..?
Renu Desai | నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?.. ‘మాజీ భార్య’ ట్యాగ్‌పై నటి రేణు దేశాయ్ ఆవేదన
Supreme Court: ఢిల్లీ వెదర్ ఎంజాయ్ చేస్తున్నారనుకుంటా.. చమత్కరించిన సుప్రీంకోర్టు
హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దే : జగన్ మోహన్ రావు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

