Siva Karthikeyan | ట్విట్టర్‌కి దూరంగా ఉండండి : శివ కార్తికేయన్
Siva Karthikeyan | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ సినిమాలో మానేసి రాజకీయల్లోకి వెళ్లడం.. అజిత్ సినిమాలు కాకుండా రేసింగ్‌లపై దృష్టి పెట్టడంతో ఈ స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారు అని తమిళ సినీ ఇండస్ట్రీలో చాలరోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.
Siva Karthikeyan | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ సినిమాలో మానేసి రాజకీయల్లోకి వెళ్లడం.. అజిత్ సినిమాలు కాకుండా రేసింగ్‌లపై దృష్టి పెట్టడంతో ఈ స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారు అని తమిళ సినీ ఇండస్ట్రీలో చాలరోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ అంచనాలను పెంచుతూ నేనున్నాను అంటూ ముందుకు వచ్చాడు శివ కార్తికేయన్. ఇండస్ట్రీలోకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం కోలీవుడ్‌లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు శివ. రీసెంట్గా అతడు నటించిన అమరన్ చిత్రం కూడా రూ.300 కోట్ల క్లబ్లో చేరడంతో రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ తర్వాత ఆ రేంజ్ ఉన్న అగ్ర హీరోల జాబితాలో చేరాడు. అయితే ఈ నటుడు ప్రస్తుతం ఉన్న యువత సోషల్ మీడియా వాడోద్దంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
గోవాలో జరుగుతున్న ఫిలిం ఫెస్ట్వల్లో ముఖ్య అతిథిగా పాల్గోన్న శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న యూత్‌కి ఒకటి చెప్పాలి అనుకుంటున్నా. సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండండి. ముఖ్యంగా ట్విట్టర్(ఎక్స్)కి చాలా దూరంగా ఉండండి. ఈ విషయం చెప్పినందుకు ఎలాన్ మస్క్ నన్ను బ్లాక్ చేసిన సరే. కొన్ని ఏండ్లుగా నేను ఇదే ఫాలో అవుతున్నాను. సాధారణంగా నా సినిమా ఎప్పుడైన పరజయం పొందింతే సోషల్ మీడియాలో చూసి తప్పులు సరి చేసుకునేవాడిని. అయితే ఈ మధ్య సోషల్ మీడియా వాడుతుంటే ఫెయిల్ అయిన సినిమాలకు ఫలితం ఇవ్వకపోగా నెగటివిటీని మరింత పెంచిందని చెప్పుకొచ్చాడు. నేను టీవీ యాంకర్‌గా ఉన్నప్పుడు ఇంటర్ నెట్ ఎక్కువ లేకుండేది. అప్పుడు నేను ఏమైన తప్పులు చేస్తున్నానా అని ఫీడ్ బ్యాక్ తీసుకునే వాడిని. కానీ ఇప్పుడు ఎక్స్‌లో అలా లేదు. అందుకే బ్యాక్ టు బేసిక్స్ (మూలాల్లోకి వెళ్లి నేర్చుకోవడం) సూత్రాన్ని పాటించాను. దీంతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాను అంటూ శివ చెప్పుకోచ్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

