My baby | సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మై బేబీ’ జూలై 18న గ్రాండ్ రిలీజ్
My baby Movie | ఇటీవల తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన ‘డి.ఎన్.ఎ’ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
My baby Movie | ఇటీవల తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన ‘డి.ఎన్.ఎ’ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఎస్.కె. పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాత సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని ‘మై బేబి’ పేరుతో ఈనెల జూలై 18న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా మూవీ సెన్సార్‌ను పూర్తి చేసుకుంది.
గతంలో ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’, ‘షాపింగ్ మాల్’, ‘పిజ్జా’ వంటి 15 విజయవంతమైన చిత్రాలను నిర్మాతగా అందించిన సురేష్ కొండేటి, డిస్ట్రిబ్యూటర్‌గా 85కు పైగా సినిమాలను విడుదల చేశారు. ‘మై బేబి’ ఆయన నిర్మాణంలో వస్తున్న 16వ చిత్రం. ఈ సినిమా కూడా భారీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అధర్వ మురళి మరియు నిమిషా సజయన్ జంటగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి నెల్సన్ వెంకటేసన్ దర్శకత్వం వహించారు. 2014లో ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన ఒక దుర్ఘటన ఆధారంగా ఈ కథ రూపొందిందని చిత్ర బృందం తెలిపింది. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో కూడిన భావోద్వేగభరితమైన కథాంశం ఈ సినిమా ప్రత్యేకత అని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రాన్ని ఎస్.కె. పిక్చర్స్ ద్వారా విడుదల చేయనున్నారు. సాయి చరణ్ తేజ పుల్లా, దుప్పటి గట్టు సారిక రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

