చదవులు ముఖ్యమా ? కళలు ముఖ్యమా? చిన్నతనంలో పిల్లలు ఎలా తమ కెరీర్‌ను ఎంచుకోవాలో మ్యూజిక్ స్కూల్(Music School) ఫిల్మ్ మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. పాపారావు బియ్యల డైరెక్ట్ చేసిన ఈ సినిమా పిల్లల్లో దాగిన ట్యాలెంట్‌ను వెలికి తీస్తుంది. కిడ్స్‌గా ఉన్నప్పుడు చదువుల కోసం పేరెంట్స్ పెట్టే టెన్షన్ తెలిసిందే. అకాడమిక్స్‌లో సూపర్ మార్క్స్ స్కోర్ చేయాలని తల్లితండ్రులు హైరానా పెడుతుంటారు. ఆ సమయంలో ఆటలు, పాటలు లాంటి ఎక్స్ట్రాకర్క్యూలర్ కార్యక్రమాలకు పిల్లల్ని దూరంగా పెడుతుంటారు. అయితే మ్యూజిక్ స్కూల్ చిత్రంలో కళలకు ప్రాధాన్యత ఇచ్చిన తీరు ఆకట్టుకుంటుంది.
ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఇళయరాజా కొన్ని మంచి బాణీలను ఈ సినిమాకు అందించారు. ఈ ఫిల్మ్‌లో మొత్తం 12 సాంగ్స్ ఉన్నాయి. మ్యూజిక్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా వేగంగా వెళ్తుంది. ఈ చిత్రంలో శ్రియ శరణ్, షర్మన్ జోషీలు కీలక పాత్రలు పోషించారు. డ్రామా టీచర్ మనోజ్ పాత్రను జోషీ పోషించారు. ఇక మ్యూజిక్ నేర్పే పాత్రలో శ్రియ నటించింది. చదువులతో పాటు పిల్లల్లో మ్యూజిక్ పట్ల ఆసక్తిని పెంచే ప్రయత్నం చేసే ఆ పాత్రల్లో ఇద్దరూ అద్భుతంగా నటించారు.
సౌండ్ ఆఫ్ మ్యూజిక్ కాన్సెప్ట్ ఈ ఫిల్మ్‌లో టాప్ రేంజ్లో కనిపిస్తుంది. శ్రియ తన మ్యూజిక్ ట్యాలెంట్‌తో పిల్లల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. గోవాకు చెందిన ఆ బ్యూటీ ఇందులో మారియా పాత్రతో కేక పుట్టించింది. మ్యూజిక్ లవర్స్‌ను తెగ అట్రాక్ట్ చేసే రీతిలో సినిమాను రూపొందించారు. రెండు గంటల 5 నిమిషాలు ఉన్న ఈ చిత్రం కథాగమనంలో ఎంతో ఆకర్షణీయంగా సాగుతుంది. షర్మన్, శ్రియా కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలెట్. ప్రతి ఫ్రేమ్‌లో ఆ ఇద్దరూ జిగేల్మాంటారు. ఫిల్మ్ చివర వరకు స్టార్లు ఇద్దరూ తమ పర్ఫార్మెన్స్తో ఇరగదీశారు.
ఈ ఫిల్మ్‌లో ప్రకాశ్ రాజ్, లీలా సాంసన్లు ప్రత్యేక పాత్రలు పోషించారు. వాళ్ల రోల్‌కు ఆ నటీనటులు న్యాయం చేశారు. ఇక మ్యూజిక్ స్కూల్ పిల్లలు .. చిచ్చరపిడుగులే. స్టాన్లీ క డబ్బా, చిల్లర్పార్టీ సినిమాల్లో ఉన్న గ్రూపుల తరహాలో పిల్లలు ఫుల్ జోష్ పుట్టిస్తారు. అన్ని ఏజ్ గ్రూపులు, ఒకే తరహా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఆ పిల్లలు మ్యూజిక్ స్కూల్‌ను థ్రిల్ చేస్తారు. ఎంతో క్రియేటివ్ ట్యాలెంట్‌తో ఏదో చేయాలన్న తపనలో ఉన్న ఆ పిల్లలు తమ తల్లితండ్రుల ఆశయాలకు తగిన రీతిలో ఎలా రాణిస్తారో ఫిల్మ్‌లో చూడాల్సిందే.
తొలిసారి ఫీచర్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ పాపారావు బియ్యాల.. చాలా సందేశాత్మక సబ్జెక్ట్‌తో అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. చాలా ఫ్యామిలీ ఫ్రెండ్లీ స్టయిల్లో సినిమా స్టోరీ లైన్‌ను ప్రజెంట్ చేశారు. మ్యూజిక్ లవర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫిల్మ్‌ను మిస్కాలేరు. ఈ సినిమాను చూసిన ప్రతి ఫిల్మ్గోయర్ తన చిన్నతనాన్ని గుర్తు చేసుకోవడం ఖాయం. మీ పిల్లలు వత్తిడిలో ఉన్నట్లయితే.. వాళ్లకు మీరు ఈ సినిమా చూపించాల్సిందే.
ఫిల్మ్: మ్యూజిక్ స్కూల్
డైరెక్టర్: పాపా రావు బియ్యాల
మ్యూజిక్: ఇళయరాజా
నటులు: శ్రియ శరన్, షర్మన్ జోషీ
రేటింగ్: 3.25/5