e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, November 29, 2021
Home News Mumbai Drugs Case | నా వాట్సాప్‌ చాట్స్‌ను వక్రీకరిస్తున్నారు.. ఆర్యన్‌ ఖాన్ ఆరోపణ

Mumbai Drugs Case | నా వాట్సాప్‌ చాట్స్‌ను వక్రీకరిస్తున్నారు.. ఆర్యన్‌ ఖాన్ ఆరోపణ

ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ తనయుడు ఆర్యన్‌ ఖాన్ ప్రస్తుతం నార్కొటిక్స్ బ్యూరో (ఎన్సీబీ) అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. బెయిలు కోసం అతను ఇప్పటి వరకూ వేసిన పిటిషన్లన్నింటినీ కోర్టు తోసిపుచ్చింది.

ఈ క్రమంలో బాంబే హైకోర్టు ముందు తన బెయిలు కోసం మరోసారి ఆర్యన్‌ పిటిషన్ వేశాడు. అతనికి బెయిలు ఇవ్వొద్దని వాదిస్తున్న ఎన్సీబీ ఆర్యన్ వాట్సాప్ చాట్స్‌ను సాక్ష్యాలుగా చూపుతోంది, వీటిలో అతను పలువురితో డ్రగ్స్ గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది.

- Advertisement -

అయితే తన వాట్సాప్ చాట్స్‌ను ఎన్సీబీ వక్రీకరిస్తోందని, తనపై నిందారోపణలు చేస్తోందని తన తాజా బెయిలు పిటిషన్‌లో ఆర్యన్ పేర్కొన్నాడు. ఈ బుధవారం నాడు అతను వేసిన బెయిలు పిటిషన్‌ను నార్కొటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్‌) యాక్ట్ కోర్టు కొట్టివేసింది.

ఈ నేపథ్యంలో తాజా బెయిలు పిటిషన్‌ను బాంబే హైకోర్టులో వేసిన ఆర్యన్‌ తన పిటిషన్‌లో ఎన్సీబీపై ఆరోపణలు చేశాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement