Salim Ghouse | ఇండస్ట్రీలో విషాదం..మల్టీ టాలెంటెడ్ యాక్టర్ సలీమ్ కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు సలీమ్ ఘౌస్ (Salim Ghouse) కన్నుమూశారు. సలీం ఘౌస్ (70)కు గురువారం ఉదయం గుండెపోటు (cardiac arrest) రావడంతో తుదిశ్వాస విడిచారు.
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు సలీమ్ ఘౌస్ (Salim Ghouse) కన్నుమూశారు. సలీం ఘౌస్ (70)కు గురువారం ఉదయం గుండెపోటు (cardiac arrest) రావడంతో తుదిశ్వాస విడిచారు. 1952 జనవరి 10న మద్రాస్ (ప్రస్తుత చెన్నై)లో జన్మించారు సలీమ్ గౌస్. థియేటర్ ఆర్టిస్టు, థియేటర్ డైరెక్టర్, టీవీ యాక్టర్, సినిమా నటుడే కాదు..మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు కూడా. తమిళంలో కమల్ హాసన్, విజయ్ లాంటి స్టార్ హీరోలతో నటించారు. మణిరత్నం డైరైక్షన్లో నటించారు.
తన ఫ్యామిలీ మల్టీ కల్చరల్ ఫ్యామిలీ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సలీమ్. తండ్రి ముస్లిం..తల్లి క్రిస్టియన్..పంజాబీ భార్య..బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన బావమరిది..ఇలా భారతదేశమంతా మా ఇంట్లోనే ఉందంటూ చెప్పారు. సలీమ్కు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఆయనకు 6 భారతీయ భాషలతోపాటు నాలుగు అంతర్జాతీయ భాషలు వచ్చు. ఎంఎస్ విశ్వనాథన్, కన్నదాసన్ ఆయన గురువులు.

తెలుగులో రాంగోపాల్ వర్మ, నాగార్జున, ఊర్మిళా మటోండ్కర్ కాంబినేషన్ లో వచ్చిన అంతం (Antham) సినిమాలో ఇన్ స్పెక్టర్ కృష్ట పాత్రలో నటించాడు సలీమ్. ఆ తర్వాత నాగార్జునతో మరోసారి రక్షణ సినిమా చేశాడు. దీంతోపాటు మెగాస్టార్ చిరంజీవి నటించిన ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో వన్ ఆఫ్ ది విలన్గా నటించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

