ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల జంటగా నటిస్తున్న సినిమా ‘నవాబ్’. ఈ చిత్రాన్ని నమో క్రియేషన్స్ పతాకంపై ఆర్ఎం నిర్మిస్తున్నారు. రవి చరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విశేషాలను తాజా ప్రెస్మీట్లో వెల్లడించారు. దర్శకుడు రవి చరణ్ మాట్లాడుతూ…‘నా గత సినిమా ‘నల్లమల’ మంచి విజయాన్ని సాధించింది.
ద్వితీయ ప్రయత్నంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. డంపింగ్ యార్డ్ నేపథ్యంలో కథ సాగుతుంది. దీని కోసం 12 ఎకరాల్లో డంపింగ్ యార్డ్ సెట్ నిర్మించాం. ఒక వైవిధ్యమైన ప్రయత్నంగా ఈ సినిమాకు పేరొస్తుంది’ అన్నారు. రామరాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : రమేష్ కేఆర్, సంగీతం : పీఆర్.