Mrunal Takhur | యాక్టర్‌తో కాదు, క్రికెటర్‌తో డేటింగ్.. మృణాల్ రిలేషన్ షిప్ న్యూస్ వైరల్
Mrunal Takhur | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అందాల హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్లో ఉన్నారంటూ గత కొన్ని నెలలుగా రూమర్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.. ఈ ఇద్దరూ మూవీ ఈవెంట్స్, ప్రైవేట్ పార్టీల్లో తరచూ కలిసి కనిపించడం, ఫోటోలు వైరల్ కావడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి.
Mrunal Takhur | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అందాల హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్లో ఉన్నారంటూ గత కొన్ని నెలలుగా రూమర్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.. ఈ ఇద్దరూ మూవీ ఈవెంట్స్, ప్రైవేట్ పార్టీల్లో తరచూ కలిసి కనిపించడం, ఫోటోలు వైరల్ కావడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. గతంలోనే మృణాల్ దీనిపై స్పందించినప్పటికీ… తాజా పరిణామాలు మళ్లీ చర్చకు తావిచ్చాయి. మృణాల్ ఠాకూర్ తన తాజా హిందీ చిత్రం ‘దో దివానే షెహర్ మే’ టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ పోస్టుకు ధనుష్ “టీజర్ చాలా బాగుంది” అని కామెంట్ చేశాడు.దానికి మృణాల్ లవ్ సింబల్ తో రిప్లై ఇవ్వడం ఇంటర్నెట్లో సంచలనంగా మారింది. ఈ ఇద్దరి కామెంట్ల స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఈ ఇద్దరు లవ్‌లో ఉన్నారని తెగ ప్రచారం చేశారు.
అయితే అభిమానుల్లో మరొక వర్గం మాత్రం ఇది కేవలం ఫ్రెండ్లీ రిప్లై మాత్రమే. గతంలోనే మృణాల్ రూమర్స్‌ను ఖండించింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం మృణాల్ నటుడితో కాదు క్రికెటర్‌తో డేటింగ్లో ఉందంటూ కొత్త ప్రచారం మొదలైంది. టీమ్ఇండియా వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, మృణాల్ ఠాకూర్ రహస్యంగా డేటింగ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో విపరీతమైన వార్తలు వస్తుండగా, ఇందులో నిజమెంత ఉందనే దానిపై క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఇటీవలే చిగురించిందని కొన్ని జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే ఈ ప్రేమ వ్యవహారాన్న గోప్యంగా ఉంచుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడిన శ్రేయస్ అయ్యర్ రెస్ట్‌లో ఉన్నాడు. క్రమంగా కోలుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే సమయంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌తో శ్రేయస్ అయ్యర్ ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన మృణాల్.. నా కెరీర్లో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. నేను నా పనిపై ఫోకస్ చేస్తున్నా. నా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు అని పేర్కొంది. మరి దీనిపై క్లారిటీ రావలసి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

